‘ప్రభాస్ అంటే పిచ్చి క్రష్.. ఆయన లాంటి భర్త కావాలి’
ఇండియన్ సినిమా రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరైనా ఉంటే అది ప్రభాస్. తెలుగు సినిమా రంగంలోనే కాకుండా ఇతర భాషలకు చెందిన హీరోయిన్లు కూడా ఈ బాహుబలి కటౌట్‌పై మనసు పారేసుకొంటారు. ఇప్పటికే ఈ యంగ్ రెబల్ స్టార్‌పై మోజు పడిన భామలు ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా ఆ జాబితాలో మోస్ట్ హ్యాప్పెనింగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరీ కూడా చేరిపోయారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన మనసులోని మాటలను వెల్లడించింది. ఈ బ్యూటీ చెప్పిన విషయాల్లోకి వెళితే..
నా కాబోయే భర్త గురించి వంద విషయాలు నా మనసులో ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు చెప్పలేను. అయితే ముఖ్యంగా హైట్ ఉండాలి. అలాగే మంచి మనసు ఉన్న వ్యక్తి కావాలి. అంతేకాకుండా ఇంటెలిజెంట్ అయి ఉండాలి. సాధారణంగా ఓ మగాడిలో నాకు కావాల్సిన అంశాలు ఇవే అని మీనాక్షి చౌదరీ ముసిముసి నవ్వులు నవ్వారు.

నేను మంచి హైట్‌గా ఉంటాను. నా ఎత్తు 5.8 అడుగుల ఎత్తు. కాబట్టి నా ఎత్తుకు తగిన వ్యక్తి ఉండాలని కోరుకొంటాను. నా కంటే ఎత్తు తక్కువగా ఉంటే ఫ్లాట్‌గా చెప్పులేసుకొని ఉండలేను కదా. నా హైట్‌కు తగిన అబ్బాయి ఉండాలనేది నా మొదటి కండీషన్. ముఖ్యంగా నాలాంటి రూపానికి తగిన అబ్బాయి కావాలి. నేను ఉన్నానంటే.. నాకు సమానంగా మేల్ వెర్షన్ కావాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే నేను పెళ్లి చేసుకొంటాను అని మీనాక్షి తన మనసులో మాట చెప్పింది.
ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రభాస్. నాకు సరిపోయే హైట్ ఉంటాడు. ప్రస్తుతం ప్రభాస్ అంటే నాకు బాగా క్రష్. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయన పొడుగ్గా ఉంటాడు. హ్యాండ్సమ్గా కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తి దొరికితే.. నేను పెళ్లి చేసుకొంటాను అని మీనాక్షి చౌదరీ సిగ్గు పడుతూ వెల్లడించింది. ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నది.

మీనాక్షి చౌదరీ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలతో టాప్ హీరోయిన్ అనే రేంజ్ చేరుకొన్నారు. ఇటీవల ఆమె నటించిన గుంటూరుకారం, ఖిలాడి, ది గోట్, లక్ష్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ చిత్రాలు భారీ విజయాలు అందుకొన్నాయి. దాంతో ఆమెకు అవకాశాలు భారీగా వస్తున్నాయి.
అలాగే మీనాక్షి చౌదరీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండుగ రేసులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే 200 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో 2024, 2025 సంవత్సరంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనే ట్యాగ్ సొంతం చేసుకొన్నది. ఆమెకు నచ్చినట్టు కూడా భర్త లభిస్తాడో ఏమో చూడాలి.


Click it and Unblock the Notifications











