Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా.. ఎవరితో ప్రేమలో పడిందంటే?
చాలా మంది హీరోయిన్స్ విషయంలో తమ మొదటి సినిమా తోనే మంచి డెబ్యూ అందుకోవడంతో సాలిడ్ ఆఫర్స్ అందుకుంటారు కానీ కొందరి కేసుల్లో ఇలా ఉండదు. కొందరికి సరైన హిట్ రాకపోయినప్పటికీ వరుస ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఇలా ఒక ప్లాప్ బ్యూటీ తెలుగు సినిమా సహా సౌత్ లో మంచి హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారుతుంది.
కాగా ఆ హీరోయిన్ ఎవరో కాదు లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం తో సెన్సేషనల్ హిట్ అందుకున్న బ్యూటీ మీనాక్షి చౌదరి. కాగా మీనాక్షి సినిమాలోకి ఎంటర్ అయ్యిందే మాస్ మహారాజ ఖిలాడీ సినిమాతో అని అందరికీ తెలుసు. కాగా అందులో మీనాక్షి చూపించిన హాట్ షోకి తెలుగు యువత మెస్మరైజ్ కూడా అయ్యారు. అలా ప్లాప్ తోనే తన ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ తర్వాత ఏమాత్రం తగ్గలేదు.

ఇలా ఒక హిట్టు ఒక ప్లాప్ తో తెలుగు సినిమాలో తమిళ్ సినిమాలో హాట్ టాపిక్ గా ఈమె నిలిచింది. అయితే ప్రతీ హీరోయిన్ విషయంలో ఉన్నట్టే ఈమెకి కూడా ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా, అఫైర్స్ ఉన్నాయా అనేది కూడా అప్పుడప్పుడూ చర్చకి వస్తాయి. కాగా ఇపుడు ఇలానే ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న యాంకర్ సుమ నుంచి ఆమెకి ఎదురు కాగా ఈమె లైఫ్ లో ఇప్పుడు వరకు ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ చాప్టర్ ని చెప్తున్నాను అని తెలిపింది.
కాగా ప్రతీ ఒక్కరికీ అమ్మాయిలో అబ్బాయిలో తమ లైఫ్ లో కనీసం ఒక్కసారి అయినా కూడా ఒక క్రష్ తప్పకుండా ఉంటారు అని చెప్పుకొచ్చింది. అలానే తన లైఫ్ లో కూడా ఒక క్రష్ ఉన్నారని చెప్పుకొచ్చింది. తన లైఫ్ లో అది కూడా తొమ్మిదో తరగతిలోనే అంటూ అసలు విషయం చెప్పింది. తన టీచర్ అంటే ఎంతో క్రష్ ని తాను మాత్రమే కాదు తమ క్లాస్ లో మిగతా అమ్మాయిలు అంతా ఆ టీచర్ కి ఫ్లాట్ అయ్యిపోయాం అంటూ తన ఫస్ట్ క్రష్ కోసం రివీల్ చేసింది.
అయితే ఇపుడు మాత్రం ఎవరు లేరు అన్నట్టే చెప్పుకొచ్చింది. సినిమాలో కానీ బయట కానీ ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని అంటుంది. కాగా ఇదే సందర్భంలో తన పెళ్లి కోసం కూడా ఓపెన్ అయ్యింది. అయితే పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడప్పుడే కాదు కొంత సమయం తర్వాత చేసుకుంటాను అంటూ పెళ్లిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది ఈ హ్యాపెనింగ్ హాట్ బ్యూటీ. కాగా ఈ కొన్ని నెలల్లోనే తమిళ్ నుంచి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అలాగే తెలుగులో మెకానిక్ రాకీ ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలతో పలకరించింది. ఇక ముందు కూడా మరిన్ని సినిమాలు తెలుగులో మరియు తమిళ్ లో కూడా చేస్తుంది.


Click it and Unblock the Notifications











