మొన్న ప్రభాస్.. నేడు మహేష్.. పెద్ద హీరోలను టార్గెట్ చేస్తున్న చిన్న హీరోయిన్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత అయితే కొంత ఎక్కువగానే ఉందనే చెప్పాలి. ఎక్కువగా రష్మిక మందన్న - పూజా హెగ్డే మొన్నటి వరకు గ్యాప్ లేకుండా అన్ని వర్గాల హీరోలతో సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపారు. అయితే ఈ బ్యూటీలు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి చిన్న సినిమాలకు కొంత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసేశారు. దీంతో అగ్ర హీరోలు మళ్లీ చేసిన హీరోయిన్స్ తో మరోసారి సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆ ప్రభావం వలన ఇండస్ట్రీకి కొంతమంది కొత్త హీరోయిన్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే కొత్త హీరోయిన్స్ వచ్చినా కూడా అందరూ అనుకున్నట్లుగా సక్సెస్ అవ్వడం లేదు. ఇటీవల కాలంలో కృతి శెట్టి వంటివారు మెల్ల మెల్లగా పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వెళ్తున్నారు. ఇక అదే తరహాలో మరో బ్యూటీ కూడా పెద్ద హీరోలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ నటికి ప్రభాస్ సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్ర చేసేందుకు అవకాశం వచ్చిందట. అంతేకాకుండా మహేష్ బాబు రాబోయే సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి అని తెలుస్తోంది.

 Meenakshi Chaudhary special role in mahesh babu and prabhas upcoming movies

ఈ బ్యూటీ గత కొంత కాలంగా చిన్న సినిమాల్లోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటోంది. ఇతర ఇండస్ట్రీలో కూడా నుంచి కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం కేవలం తనకు నచ్చిన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అమ్మడు వీలైనంతవరకు రిస్క్ లేకుండా మంచి సినిమాలు చేయాలని అనుకుంటోంది. ఇక మీనాక్షి చౌదరి ఆలోచన విధానం ప్రకారమే ఆమెకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల ప్రభాస్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాత్ర కోసం దర్శకుడు చాలా మందివి హీరోయిన్స్ కు ఆడిషన్ నిర్వహించాడు. కానీ ఎవరు కూడా అతని అంచనాలకు తగ్గట్టుగా ఉండకపోవడంతో చివరికి మీనాక్షి చౌదరిని సింగిల్ టెస్ట్ లోనే ఫైనల్ చేసేసాడు.

ఇక ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ బాబు సినిమా కోసం మీనాక్షి చౌదరికి ప్రత్యేకమైన పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఒక డిఫరెంట్ యాక్షన్ మూవీని నవంబర్ నెలలో స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తారట. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది హీరోయిన్లు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు సినిమాలో కూడా మీనాక్షి చౌదరికి ప్రత్యేకమైన పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ బ్యూటీ జాతకం మారిపోయినట్లే. ఇప్పటికే ఖిలాడి సినిమాలో అమ్మడు నటించింది. ఆ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X