గుంటూరు కారం బ్యూటీ.. అందాలతో ఇలా ఘాటు ఎక్కిస్తున్న మీనాక్షి
మీనాక్షీ చౌదరి గురించి తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మడు ఎప్పుడో కుర్రాళ్ల గుండెల్లో దేవతగా కొలువై ఉండిపోయింది. ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో ఈ భామ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించేసరికి అందరూ ఎవరు ఈ భామ అని అనుకున్నారు. ఆ సినిమా కనుక హిట్ అయితే అమ్మడు రేంజ్ వేరేలా ఉండేది.
హిట్ కాకపోయినా ఈ ముద్దుగుమ్మ వరుస అవాశాలతో అదరగొట్టింది. రవితేజ సరసన ఖిలాడిలో మెరిసింది. ఇది కూడా మీనాక్షి కి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా.. ఈ చిన్నదానికి హిట్ ను అందించింది. హిందీ, తెలుగు అని చూడకుండా వరుస సినిమాలతో బిజీగా మారింది. అంతేనా సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

కేజీఎఫ్ లో డైలాగ్ చెప్పినట్లు బంగారు హుండీనీ చిల్లర కోసం వాడుతున్నారు అని టాలీవుడ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్స్ మీనాక్షీ మీద ఫోకస్ పెట్టలేదని, అందుకే ఆమెకు అవకాశాలు రావడం లేదు అనే టాక్ కూడా నడిచింది. ఇక ఆ సమయంలోనే మీనాక్షీ నీ పిలిచి ఆఫర్ ఇచ్చాడు త్రివిక్రమ్.
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. శ్రీలీల మొదటి హీరోయిన్ గా నటించింది. సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది శ్రీలీల కంటే మీనాక్షీ మీదనే మనసు పారేసుకున్నారు. కొంతమంది అయితే ఈమె మెయిన్ హీరోయిన్ అయితే బావుండేది అని కూడా అనుకున్నారు. ఇక ఈ సినిమా హిట్ అయితే అమ్మడు రేంజ్ వేరే లెవెల్ లో ఉండేది.
దురదృష్టం ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మీనాక్షీ బ్యాక్ టూ పెవిలియన్ అన్నట్లు బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అయినా నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. చీరకట్టులో కొన్ని.. ఫ్యాషన్ ఐకాన్ గా కొన్ని.. ఫొటోషూట్ ఏదైనా మీనాక్షీ ఫోటోలు ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉండడమే..
తాజాగా మీనాక్షీ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మోనో క్రోమ్ లో ముద్దుగుమ్మ అందాల విందు చేసింది. నడుము చూపిస్తూ కుర్రకారును కిర్రెక్కించింది. ఒక పాలరాతి శిల్పంలా మీనాక్షీ అందం మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ముందు ముందు ఈ చిన్నది స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











