విశ్వంభర మూవీలో యంగ్ హీరోయిన్.. మొత్తానికి తేల్చేసిన బ్యూటి
ఇప్పుడు టాలీవుడ్ సహా కోలీవుడ్ సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ మాత్రం కొందరు మాత్రమే ఉన్నారని చెప్పాలి. కెరీర్ ఎలా స్టార్ట్ చేసినప్పటికీ హిట్లు ప్లాప్స్ కి సంబంధం లేకుండా చాలా కొద్ది మంది హీరోయిన్స్ కి మాత్రమే వరుస ఆఫర్స్ వస్తుంటాయి. అలా ఇపుడు సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ కొందరు ఉంటే వారిలో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా ఒకామె అని చెప్పాలి.
రీసెంట్ గానే తన తమిళ బిగ్ సినిమా "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం" లో కనిపించింది. విజయ్ దళపతితో ఆమె నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలు ఈమె నుంచి ఉన్నాయి. కాగా ఈ సినిమాల్లో ప్రస్తుతం టాలెంటెడ్ మోలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో చేసిన మరో సినిమానే "లక్కీ భాస్కర్".

ట్రాక్ మర్చి దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాలు కొత్తగా స్టార్ట్ చేసిన తరుణంలో చేసిన రెండో సినిమా ఇది కాగా ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. కాగా సోషల్ మీడియాలో కూడా తన రీసెంట్ లుక్స్ తో హిట్ టాపిక్ గా కనిపిస్తున్న ఈ అమ్మడు తెలుగులో మరో బిగ్గెస్ట్ ఆఫర్ ని కూడా దక్కించుకుంది అంటూ పలు రూమర్స్ కొన్నాళ్ల నుంచి ఉన్నాయి.
కాగా ఆ సినిమా కూడా ఏదో కాదు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ విజువల్ సినిమా "విశ్వంభర". యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆల్రెడీ చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఆయా కీలక పాత్రల్లో ఉన్నారు. హీరోయిన్ గా త్రిష, కీలక పాత్రల్లో ఆషిక రంగనాథ్ అలాగే కోలీవుడ్ నటి సురభి పురాణిక్ ఇలా చాలా మందే ఉన్నారు కానీ వీరితో పాటుగా మీనాక్షి కూడా ఉందని కొన్నాళ్ల నుంచి పలు రూమర్స్ ఉన్నాయి.

అయితే ఫైనల్ గా ఈ రూమర్స్ పై మీనాక్షి చౌదరి ఓపెన్ అయ్యింది. తాను విశ్వంభర సినిమాలో భాగం కాదు అని తేల్చి పారేసింది. దీనితో ఇన్ని రోజులు ఈ అందాల భామ ఉంది అనుకున్నారు కంగుతిన్నారు. కాగా ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో తెలీదు ఏకంగా వికీపీడియాలో కూడా పెట్టడం తనకే ఆశ్చర్యంగా ఉందని చెప్పింది.
మొత్తానికి అయితే నేను అయితే ఆ సినిమాలో లేను అని ఆమె చెప్పేసింది. సో ఈ భారీ సినిమాలో ఈమె ప్రెజెన్స్ లేనట్టే అని తేలిపోయింది. ఇక ఈ సినిమా మినహా లక్కీ భాస్కర్ పనుల్లో ఆమె బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ తో మాస్ చిత్రం మెకానిక్ రాకీ అలాగే మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో భారీ పాన్ ఇండియా సినిమా మట్కా లో కూడా నటిస్తుంది. ఇలా తన నుంచి ఈ రెండు నెలల్లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











