నా కోరికను ఆ డైరెక్టర్ తీర్చేశాడు..!

Meenakshi Chaudhary: టాలీవుడ్ బ్యూటీ , హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకర్షించే అందం కలిగిన ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈ భామ.. తన అందాలతో సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ బిబీబిజీగా మారింది ఈ క్యూట్ బ్యూటీ. ఈ తాజాగా మీడియాతో మాట్లాడిన మీనాక్షి చౌదరి తన డ్రీమ్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ హీరోయిన్ మీనాక్షి కోరికలు ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

హీరోయిన్ మీనాక్షి చౌదరి తొలుత మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈ ఫేమ్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. తొలుత 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైంది. తన అందం, అభినయంతో నటించి మెప్పించింది.

Meenakshi Chowdhury made interesting comments about her dreams in sankranthiki vasthunam movie

ఆ తరువాత HIT The Second Case సినిమాలో హీరో అడవి శేష్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి మెప్పించిందీ మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ఖిలాడీ, తమిళ్ లో కొలై చిత్రాల్లో నటించింది. గతేడాది 'గుంటూరు కారం'తో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఆ తరువాత తలపతి విజయ్ 'ది గోట్‌'(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) నటించి మెప్పించింది. గత వారం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వారం విశ్వక్ సేన్ లో కలిసి 'మెకానిక్ రాకీ 'అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందు వచ్చారు.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన సినిమాలలో ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశానని, పోలీస్ ఆఫీసర్ గానే కనిపిస్తూ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కామెడీ రోల్ ను ప్లే చేశానని చెప్పారు. ఇది తన డ్రీమ్ క్యారెక్టర్ అని పేర్కొన్నారు. తనకు చిన్నప్పటి నుండి మూడు కోరికలు ఉన్నాయని తెలిపారు.

అందులో మొదటి డ్రీమ్ డాక్టర్ , రెండో డ్రీమ్ మిస్ ఇండియా.. ఇక మూడవ డ్రీమ్ సివిల్ సర్వెంట్ . ఇందులో మొదటి రెండు కోరికలను తాను నెరవేర్చుకున్నారని, కానీ మూడవ డ్రీమ్ ను తీర్చుకోలేదని చాలా సార్లు బాధపడ్డానని తెలిపారు. కానీ తన కోరికను డైరెక్టర్ అనిల్ గారు తీర్చారనీ, ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర నిచ్చి ఆ కోరికను కూడా తీర్చారని తెలిపారు. ఆ పాత్రకు తనని సెలెక్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అంటూ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాను విక్టరీ వెంకటేష్ కు వీరాభిమానిని, వారితో నటించడం తన అదృష్టంగా భావిస్తున్ననని హీరోయిన్ మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.

ఇదెలా ఉంటే.. వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిన టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటీ హీరోయిన్ మీనాక్షి చౌదరి గత కొంతకాలంగా ఈ అమ్మడు పెళ్లిపై రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అక్కినేని హీరో సుశాంత్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్ పై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని, అవన్నీ ఫేక్ అంటూ తేల్చేశారు. తొలుత ఆ వార్తలను చూసి తాను కూడా షాక్ అయ్యానని ఫీలయ్యారు.

ఇటీవల కాలంలో తనపై కావాలని ఇలాంటి రూమర్సు క్రియేట్ చేస్తున్నారనీ, గతంలో ఓ తమిళ హీరోని పెళ్లి చేసుకోబోతున్నానంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయని , ప్రతి నెల తనపై ఏదోక రూమర్ క్రియేట్ చేస్తున్నారని మీనాక్షి చౌదరి బాధపడ్డారు. ఇలాంటి రోమర్స్ ను తాను అసలు పట్టించుకోనని, ప్రస్తుతం తాను కెరీర్ పై ఫోకస్ చేశానని, ప్రస్తుతం సింగిల్ .. నాట్ రెడీ టు మింగిల్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మీనాక్షి చౌదరి .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X