డైరెక్టర్ కలిసినప్పుడు నేను బెడ్‌పై అలా.,. మా కెమిస్ట్రీ అదిరింది.. మీనాక్షి దీక్షిత్
Recommended Video
సూపర్‌స్టార్ మహేష్ నటించిన దూకుడు చిత్రంలో టైటిల్ సాంగ్‌లో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి దీక్షిత్ ఆ తర్వాత టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అయితే బాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మహర్షి సినిమాతో వెండితెర మీద మళ్లీ మెరువబోతున్నది. ఈ చిత్రంలో లభించిన అవకాశం గురించి మీనాక్షి దీక్షిత్ మీడియాతో మాట్లాడారు. మహర్షి గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ఏం చెప్పారంటే...

మహేష్‌తో న్యూయార్క్ కంపెనీలో
మహర్షి సినిమాలో మహేష్ సహఉద్యోగిగా మీనాక్షి కనిపించనున్నారు. న్యూయార్క్ కంపెనీలో మహేష్‌తో కలిసి పనిచేసే పాత్రనాది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పడిందనుకొంటున్నాను. రిషి జీవితంలో మంచి, చెడు సంఘటనల మధ్య నా పాత్ర తిరుగుతుంది అని మీనాక్షి దీక్షిత్ చెప్పారు.

ఆ సమయంలో అనారోగ్యంతో
మహర్షి సినిమాలో ఆఫర్ ఇస్తూ వంశీ పైడిపల్లి నన్ను సంప్రదించినప్పుడు నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. డెంగ్యూ, టైఫాయిడ్‌తో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాను. క్రేజీ ఆఫర్ రావడంతో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభానికి నేను రెడీగా ఉంటానని చెప్పాను. నేను మూడు వారాల్లోనే నార్మల్ కావడంపై అందరూ ఆశ్చర్యపోయారు అని మీనాక్షి చెప్పారు.

కేవలం మూడు వారాల్లోనే
మహర్షి కోసం కేవలం మూడు వారాల్లో నేను కోలుకొన్నాను. మామూలుగా కావడానికి యోగా చేశాను. ఎక్కువ దూరం నడవడం ప్రాక్టీస్ చేశాను. విటమిన్లు తీసుకొంటూ ఆరోగ్యాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చుకొన్నాను. మహర్షి నన్ను మామూలు మనిషిని చేసిందని అనుకొంటాను అని మీనాక్షి పేర్కొన్నారు.

మే 9న మహర్షి రిలీజ్
వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర ఫిలింస్, వీపీపీ, వైజయంతి బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ నిర్మిస్తున్న చిత్రం మహర్షి. పూజాహెగ్డే, అల్లరి నరేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది.


Click it and Unblock the Notifications











