మహేష్ సినిమాలో 'దూకుడు' భామ స్పెషల్ రోల్!
సూపర్ స్టార్ మహెష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందేశాత్మక కథతో రూపొందితున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ బాబు ఈ చిత్రంలో స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ సీఈవోగా, రైతుల సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా మూడు విభిన్న కోణాల్లో కనిపించబోతున్నాడు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతోందట. సినిమాకు అత్యంత కీలకమైన పల్లెటూరి నేపధ్య్మలో వచ్చే సన్నివేశాల్లో మీనాక్షి దీక్షిత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో మీనాక్షి దీక్షిత్ మహేష్ బాబు సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. దూకుడు చిత్రంలో మీనాక్షి దీక్షిత్ టైటిల్ సాంగ్ లో మెరిసింది.

మీనాక్షి దీక్షిత్ నటించే సన్నివేశాల చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం మహర్షి చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాతలు. వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











