ఆ హీరోతో ముద్దు చాలా కంపర్ట్.. అందుకే అన్నిసార్లు లిప్‌లాక్.. చిరంజీవి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మీనాక్షి శేషాద్రి.. ఇప్పటితరానికి ఈమె ఎవరో తెలియకపోవచ్చు. కానీ 90 వ దశకంలో ఆమె అబ్బాయిల కలలరాణి. అందం కలబోసిన మీనాక్షి తెలుగులో చేసినవి సినిమాలే అయినా.. ఆమెను ఇప్పటికీ అభిమానులు గుర్తుపెట్టుకున్నారు. 1981లో 18 ఏళ్ల వయసులో మీనాక్షి శేషాద్రి మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. ఆ తరువాతి ఏడాదే మనోజ్ కుమార్ కొడుకు రాజీవ్ గోస్వామి సరసన పెయింటర్ బాబు సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించింది. 1983లో సుభాష్ ఘయ్ యొక్క విజయవంతమైన చిత్రం.. 'హీరో' సినిమాతో బాగా పేరుతెచ్చుకున్నది.
ఇక ఈ సినిమా తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులో మీనాక్షి.. మొదటగా బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా ద్వారా పరిచయమైంది. చిత్రంలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి సరసన ఆపద్బాంధవుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ ఒక్క సినిమా ఆమెను తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా చేసింది.

కె. విశ్వనాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1992 లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత మీనాక్షీ తెలుగులో అంతగా కనిపించలేదు. మీనాక్షి1980-90లలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది మీనాక్షి. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంది.
ప్రస్తుతం మీనాక్షీ అమెరికాలో కుటుంబంతో గడుపుతున్నారు. ఆమె కనిపించకపోయినా కూడా ఇప్పటికీ మీనాక్షీ శేషాద్రిని తెలుగువారు గుర్తుపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 60. సినిమాలకు దూరంగా ఉంటున్న మీనాక్షీ ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
బాలీవుడ్ లో దాదాపు 30 సినిమాల్లో నటించి మెప్పించిన మీనాక్షీ.. ముద్దు సీన్స్ కు మాత్రం ఒక్క హీరోతోనే కంఫర్ట్ అని చెప్పుకొచ్చింది. సన్నీ డియోల్‌తో లిప్ లాక్ చేయడం అంటే తనకు ఇష్టమని , అతనితో ఆ కిస్ సీన్స్ ఎంతో కంఫర్ట్ గా ఉండేవని ఆమె తెలిపింది. ఇప్పటివరకు అలా ఏ హీరోతో కూడా ఫీల్ అవ్వలేదని తెలిపింది.

" నిజానికి ముద్దు పెట్టాలంటే నరాలు తెగినంత పని అయ్యేది. చాలా భయమేసేది. 1987లో వచ్చిన డకైట్ మూవీలో సన్నీ డియోల్ తో లిప్ లాక్ చేసిన విధానం బాగుంది. నాకు చాలా కంఫర్ట్ గా అనిపించింది. మా ఇద్దరి మధ్య మంచి ఈక్వేషన్, అండర్ స్టాండింగ్ ఉండేది. అందుకే ఆ తర్వాతి సినిమాలలో కూడా ఇద్దరం కలిసి ముద్దు సీన్స్ చేసాం" అని చెప్పుకొచ్చింది. ఈ ఒక్క విషయమే కాకుండా అప్పట్లో తాను ఎదుర్కున్న ఇబ్బందులు, అవమానాలు అన్నింటి గురించి ఏకరువు పెట్టింది. ప్రస్తుతం మీనాక్షీ శేషాద్రి ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











