మీరాచోప్రా‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిట్ల దండకం.. వేశ్య, తిరుగుబోతు, పోర్న్‌స్టార్ అంటూ..

అందాల నటి మీరా చోప్రాకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ట్విట్టర్‌లో లైవ్ చాట్ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాని అడిగిన ప్రశ్నకు తనకు ఇస్టం వచ్చిన రీతిలో సమాధానం చెప్పగా... తారక్ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీరా చోప్రాను ఎన్టీఆర్ అభిమానులు బూతులు తిడుతూ ట్రోల్ చేయడం వివాదంగా మారింది. ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న ట్రోలింగ్‌పై ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. ఎంతకు ఈ వివాదానికి కారణమేమిటంటే..

Recommended Video

NTR Fans Trolls On Meerra Chopra || ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా పోలీస్ కేస్...!!
నాకు ఎన్టీఆర్ తెలియదు.. మహేష్ అంటే ఇష్టం...

నాకు ఎన్టీఆర్ తెలియదు.. మహేష్ అంటే ఇష్టం...


లాక్‌డౌన్ సమయంలో అభిమానులతో మాట్లాడేందుకు మీరా చోప్రా సోమవారం ట్విట్టర్‌లో లైవ్ చాటింగ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తారక్ గురించి నాకు తెలియదు. నేను ఆయన అభిమానిని కాదు. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అని సమాధానం ఇచ్చింది.

నీ తల్లిదండ్రులు కరోనాతో చచ్చిపోతారు..

నీ తల్లిదండ్రులు కరోనాతో చచ్చిపోతారు..

దాంతో మీరాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తారక్ గురించి మీకు తెలియదా? నీ తల్లిదండ్రులు కరోనావైరస్‌తో త్వరలోనే చనిపోతారు. So sad bitch అంటూ కామెంట్ చేశారు. కొందరైతే ఇంకా చెప్పలేనన్ని, రాయలేనన్ని బూతులు తిట్టారు. ఆమెను పోర్న్ స్టార్ అంటూ ట్రోల్ చేశారు. దాంతో ఈ ట్రోలింగ్ వివాదంగా మారింది.

నన్ను వేశ్య, తిరుగుబోతు అంటారా?

నన్ను వేశ్య, తిరుగుబోతు అంటారా?

తనను ట్రోలింగ్ చేయడంపై మీరా చోప్రా స్పందిస్తూ తారక్ ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. తారక్ ఎవరో అంటే తెలియదని అన్నందుకు నన్ను తిరుగుబోతు.. వేశ్య అంటూ తిడతారా? నన్ను పోర్న్‌స్టార్ అంటూ దూషిస్తారా? కేవలం నేను మహేష్ బాబును ఎక్కువగా ఇష్టపడుతానంటే ఇలా నా తల్లిదండ్రులకు దీవెనలు అందిస్తారా? అని మీరా చోప్రా ఘాటుగా స్పందించింది.

ఎన్టీఆర్ గురించి తెలియాలంటే

ఎన్టీఆర్ గురించి తెలియాలంటే

ఇంకా ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రాను వదలకుండా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ గురించి తెలియాలంటే ఆయన నటించిన శక్తి, దమ్ము సినిమాలు చూడు. నీవు వెంటనే ఆయన అభిమానిగా మారిపోతావు అంటూ ట్వీట్ చేశారు. అందుకు సమాధానం ఇస్తూ.. థ్యాంక్యూ.. నాకు అంత ఆసక్తి లేదు అంటూ మీరా రీ ట్వీట్ చేసింది.

ఎన్టీఆర్ మీరు స్పందించాలి

ఎన్టీఆర్ మీరు స్పందించాలి

ఇలాంటి అభిమానుల వల్ల తారక్ కెరీర్‌లో సక్సెస్ ఫుల్ అని అనుకొంటున్నావా? ఇలాంటి ఫ్యాన్స్ ఉండటం దారుణం. దయచేసి నా ట్వీట్‌ను విస్మరించవద్దు అంటూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి మీరా చోప్రా ట్వీట్ చేసింది. ప్రస్తుతం మీరా ట్వీట్లు, ఎన్టీఆర్ అభిమానుల ట్వీట్లు వైరల్‌గా మారాయి. అయితే ఈ వివాదంపై, మీరా రిక్వెస్ట్‌పై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మీరా చోప్రా కెరీర్ ఇలా

మీరా చోప్రా కెరీర్ ఇలా

మీరా చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా సోదరిగా సినీ పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ అంతగా నిలదొక్కులేకోపోయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం దక్కిన ఆఫర్లను చేజిక్కించుకోలేకోపొయింది. తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకు వీరుడు, మొగిలిపువ్వు లాంటి చిత్రాల్లో నటించింది. ఇంకా హిందీ చిత్రం సెక్షన్ 375, గ్యాంగ్స్ ఆఫ్ గోస్ట్స్ చిత్రాల్లోనూ, పలు తమిళ చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X