బ్రా కనిపించేలా మీరా జాస్మిన్ రచ్చ.. హాట్ డోస్ మాములుగా లేదుగా
తెలుగులో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత కనుమరుగు అయిపోయిన మీరా జాస్మిన్ ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీకి సిద్ధం అయినట్టు ఉంది. తాజాగా మీరా జాస్మిన్ పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చాలా హోమ్లీ గా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా షాక్ ఇస్తోంది. వీలైనంత వరకు చాలా నేచురల్ గా కనిపించే మీరా జాస్మిన్ ఎందుకు ఇలా దర్శనమిస్తోంది అనే సమయంలో ఇప్పటికే అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మళ్ళీ ఆమె ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే...

మలయాళ సినిమాతో
సూత్రధారణ్ అనే మలయాళ సినిమాతో సినీ అరంగ్రేటం చేసిన మలయాళ బ్యూటీ మీరాజాస్మిన్ 'అమ్మాయి బాగుంది' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు దక్క లేదు. కానీ తెలుగులో రెండో సినిమాలోనే పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. గుడుంబా శంకర్ చిత్రంలో నటించి మంచి ఫేమ్ అందుకున్న మీరాజాస్మిన్ ఆ తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించింది.

తెలుగు సినిమాలు
తెలుగులో మీరా జాస్మిన్ అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశ రామన్న వంటి చిత్రాల్లో నటించింది. ఈ బ్యూటీ మోక్ష అనే సినిమాలో చివరిగా కనిపించింది.

పెళ్లి చేసుకుని
అయితే కాస్త క్రేజ్ తగ్గడంతో వెంటనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండి పోయిన ఈ బ్యూటీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉంది. దీంతో పలు హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు మళ్ళించుకుంటోంది.

పెళ్లితో సినిమాలకు బ్రేక్
తెలుగుతోపాటు మలయాళ తమిళ భాషల్లో సినిమాలు చేసిన మీరా జాస్మిన్ 2014 ఫిబ్రవరి 9న దుబాయ్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కేవలం నాలుగు మలయాళ సినిమాలు చేసిన మీరా జాస్మిన్ ఆరేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

మీరా జాస్మిన్ రీ-ఎంట్రీ
ప్రస్తుతం మీరాజాస్మిన్ రీ ఎంట్రీకి సిద్ధమైంది. మలయాళంలో రామ్ హీరోగా నటిస్తున్న మకల్ ఈ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునే దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం.
ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ
మీరా చివరిగా 2016లో విడుదలైన '10 కమాండ్‌మెంట్స్'లో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 2018లో వచ్చిన 'పూమరం' అనే సినిమాలో మీరా ఒక అతిథి పాత్రలో కనిపించింది. ఇక రీఎంట్రీ సందర్భంగా మీరాజాస్మిన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా దాలను ఆరబోస్తూ వరుసగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ అందాలను ప్రదర్శిస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె షేర్ చేసిన ఫోటోలలో లోదుస్తులు కనపడే విధంగా అందాలు ఆరబోయడం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











