For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Meera Mithun పీకల్లోతు కష్టాల్లోకి.. బిగ్’బాస్ బ్యూటీకి సైబర్ క్రైమ్ కేసు ఉచ్చు!

  |

  తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్, మోడల్ మీరా మిథున్ వివాదాల్లో ఉండటం కొత్తేమీ కాదు. ప్రతీ విషయంలో తన నోటి దురుసును బయటపెట్టుకొంటూ ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇప్పటి వరకు సినీ ప్రముఖులను మాత్రమే టార్గెట్ చేసే మీరా మిథున్ తన సహనాన్ని కోల్పోయారు. తాజా ఇంటర్వ్యూలో కులాలపై వివాదాస్పద కామెంట్లు చేసి మరో వివాదంలో ఇరుక్కుపోయారు. ఆమె చేసిన కామెంట్లు ఏమిటీ, గతంలో ఆమె వ్యవహరించిన తీరు ఏమింటంటే...

  బిగ్‌బాస్ తమిళ్‌తో గుర్తింపు

  బిగ్‌బాస్ తమిళ్‌తో గుర్తింపు

  మీరా మిథున్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు తమీజ్ సెల్వి. డాక్టర్ చెరియన్ ఫౌండేషన్‌లో కొంతకాలం పనిచేశారు. కెరీర్ ఆరంభంలోనే పెళ్లి చేసుకొన్న ఆమె కొద్ది రోజులకే విడాకులు ఇచ్చారు. 2017లో 8 థోట్టక్కల్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత సూర్యతో తానా స్నెందా కొట్టమ్, భోదయ్ యేరి భుదీ మారి, డ్రీమ్ నైట్స్ లాంటి చిత్రాల్లో నటించారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 3తో మరింత గుర్తింపు తెచ్చుకొన్నారు.

  త్రిష, సూర్య, విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు

  త్రిష, సూర్య, విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు

  తమిళ చిత్రాల్లో పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేని మీరా మిథున్ కొద్ది రోజుల క్రితం త్రిష కృష్ణన్, విజయ్ సూర్య లాంటి ప్రముఖులను టార్గెట్ చేసుకొన్నారు. త్రిష తన స్టైల్‌ను కాపీ చేస్తున్నారు. తన హెయిర్ స్టైల్‌ను అనుకరిస్తున్నారని త్రిషాపై మండిపడింది. ఇక సూర్య, విజయ్‌కు బంధుప్రీతి ఎక్కువ, తనవారికే అవకాశాలు ఇస్తుంటారు అంటూ నెపోటిజం, ఫేవరిటజం లాంటి ఆరోపణలు చేశారు.

  తమిళ డైరెక్టర్‌పై దారుణంగా

  తమిళ డైరెక్టర్‌పై దారుణంగా

  తమిళ సినీ రంగంలో వివాదాస్పద నటిగా పేరున్న మీరా మిథున్ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ పరైయార్ కమ్యూనిటికి చెందిన డైరెక్టర్‌ గురించి తీవ్రమైన పదజాలంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తన లుక్‌ను అభ్యంతరకరంగా చూపించారు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని సినిమా ఇండస్ట్రీ నుంచి ఏరిపారేయాలి అంటూ ఘాటుగా స్పందించారు.

  ఎస్సీ, బీసీ కులాలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు

  ఎస్సీ, బీసీ కులాలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు

  మీరా మిథున్ తాజా ఇంటర్యూలో మరో అడుగు ముందేసి మాట్లాడుతూ.. నేను ఎస్సీ కులాలను టార్గెట్ చేయడం లేదు. కానీ కొందరు షెడ్యూల్ కులాలకు చెందిన వారు అనైతిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతారు. షెడ్యూల్ కులాల వారి వల్లే అనసరమైన గొడవలు, వివాదాలు వస్తున్నాయి. వారి వల్లే ప్రజల్లో అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయి అంటూ మీరా మిథున్ కులాపై ఘాటుగా స్పందించారు. దీంతో మీడియాలో రచ్చ మొదలైంది.

  అవమానించేలా మీరా వ్యాఖ్యలు అంటూ

  అవమానించేలా మీరా వ్యాఖ్యలు అంటూ

  మీరా మిథున్‌ వ్యాఖ్యలతో సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు అభ్యంతరం చెప్పారు. తన వ్యాఖ్యలను ఆమె వెనుకకు తీసుకోవాలి. భేషరుతగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, బీసీ కులాలను ఉద్దేశించి మాట్లాడిన తీరు అవమానకరంగా ఉన్నాయి. ఆమెపై కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. విదుతాలై సురుతైగల్ కచ్చి, థోల్ తిరుమవలన్ లాంటి సంస్థల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

  తమిళ సామాజిక సంస్థల ఆగ్రహం

  తమిళ సామాజిక సంస్థల ఆగ్రహం

  ఎస్పీ, బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరా మిథున్‌పై ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటిస్ యాక్ట్ పెట్టాలని డిమాండ్ పెరిగిపోవడంతో తమిళనాడు పోలీసులు స్పందించారు. వీఎస్‌కే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించారు. ఆమెపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులు చర్య తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆధారాలు ఉండటంతో ఆమె తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారనే వాదన వినిపిస్తున్నది.

  Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
  పబ్లిసిటీ కోసమా? లేక వాస్తవంగానే..

  పబ్లిసిటీ కోసమా? లేక వాస్తవంగానే..

  అయితే మీరా మిథున్ వ్యాఖ్యలను కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదు. మీరా తన సినిమా ప్రమోషన్ కోసం, పబ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె చేసే వ్యాఖ్యలు సాధారణంగా వివాదంతో కూడి ఉంటాయి కాబట్టి ఈ సారి మాత్రం పోలీసుల చేతులో చేదు అనుభవాన్ని ఎదుర్కొక తప్పదనే మాట వినిపిస్తుంది. కొద్ది రోజుల్లో మీరా మిథున్ తాజా కేసు ఏ టర్న్ తీసుకొంటుదో వేచి చూడాల్సిందే.

  English summary
  Meera Mithun comments on SC cast row: Cyber crime police Case booked against Bigg Boss beauty over derogatory comments on dalits.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X