త్రిషపై యువ హీరోయిన్‌ నోటి దురుసు.. ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ.. ఏం జరిగిందంటే!

తమిళ చిత్రపరిశ్రమలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్, యువ హీరోయిన్ మీరా మిథున్‌కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి కనిపిస్తున్నది. గత కొద్దికాలంగా ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకొంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకొంటున్నారు. తాజాగా వారి మధ్య గొడవ మితిమీరిందనే స్థాయికి చేరుకొన్నది. త్రిషకు తాజాగా మీరా మిథున్ వార్నింగ్ ఇవ్వడం తమిళ పరిశ్రమలో, మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంతకు వారి మధ్య గొడవ ఏమిటంటే..

మీరా మిథున్ వివాదాస్పద ట్వీట్లతో

మీరా మిథున్ వివాదాస్పద ట్వీట్లతో

యువ హీరోయిన్ మీరా మిథున్ ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చూస్తూ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వంపై వివాదాస్పద ట్వీట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి అంత సీన్ లేదు. ప్రధాని మోదీ గారు.. ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేసి.. నన్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చేయండి. ఒక నేలలోనే పరిస్థితిని అదుపులోకి తెస్తా. నేరస్థులందర్నీ జైల్లో పెడుతా అంటూ ట్వీట్ చేసి దుమారం లేపారు.

 అనేక వివాదాలతో మీడియాలో

అనేక వివాదాలతో మీడియాలో

మీరా మిథున్ విషయానికి వస్తే.. ఇలాంటి వివాదాలు సృష్టించడం కొత్తేమీ కాదు. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ నానా హంగామా చేసి మీడియా దృష్టిని ఆకర్షించారు. అందాల పోటీలను నిర్వహిస్తూ స్కామ్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె ఇలాంటి కథనాలను తమిళ మీడియా గతంలో ప్రచురించని విషయం తెలిసిందే. మీరా కెరీర్ విషయానికి వస్తే.. థన్నా సెర్నదా కొట్టమ్, 8 తొట్టకాల్ అనే చిత్రాల్లో నటించింది.

 తాజా ఫోటోషూట్ వివాదంగా

తాజా ఫోటోషూట్ వివాదంగా

ఇటీవల మీరా మిథున్ పెళ్లికి సంబంధించిన ఫోటోషూట్ చేసింది. ఆ షూట్‌లో భాగంగా పెళ్లికూతురుగా తయారైన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తన పెళ్లి అనే విధంగా బిల్డప్ ఇస్తూ నెటిజన్లను కన్‌ఫ్యూజ్ చేసింది. దాంతో మీరా మిథున్ పెళ్లి జరిగిందా అనే అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత తన పెళ్లి జరుగలేదు.. బ్రైడల్ ఫోటోషూట్ అంటూ వివరణ ఇచ్చింది.

నా ఫోటోలు కాపీ చేయవద్దు..

నా ఫోటోలు కాపీ చేయవద్దు..

అయితే మీరా మిథున్ బ్రైడల్ ఫోటోషూట్ తర్వాత త్రిషా కూడా అాలాంటి ఫోటోలను షేర్ చేశారు. పెళ్లికూతురిలా ముస్తాబై సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్టు చేశారు. అయితే తనను అనుకరిస్తూ అలాంటి ఫోటోలు పెట్టిందనే భ్రమకు మీరా మిథున్ గురైంది. తాజాగా నన్ను కాపీ కొట్టకు అంటూ మీరా మిథున్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
 లీగల్ యాక్షన్ తీసుకొంటాను..

లీగల్ యాక్షన్ తీసుకొంటాను..

మీరా మిథున్ అంతటితో ఆగితే వివాదానికి బీజం పడకుండా ఉండిపోయేదేమో. కాపీ కొట్టకుం అంటూనే ఇది నీకు చివరి వార్నింగ్ అంటూ త్రిషపై మండిపడ్డారు. మరోసారి నా మాదిరిగా ఫోటోలను ఫోటోషాప్‌లో మార్ఫింగ్ చేసి.. నా మాదిరిగా జుట్టుతో ఫోటోలు పెడితే.. లీగల్ యాక్షన్ తీసుకొంటాను. నీవు ఏం చేస్తున్నావో నీకు తెలుసనుకొంటా. నీ ఆత్మానుసారమే చేస్తున్నావా? కాస్త మెచ్యుర్డ్‌గా వ్యవహరించు. మంచి జీవితాన్ని అనుభవించు అంటూ మీరా మిథున్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X