మూడో భర్త కుడా విడాకులు.. సింగిల్‌గా ఉన్నా అంటున్న హీరోయిన్..
సినీ తారల ప్రేమకథలు, పెళ్లిళ్లు, విడాకులు ఎప్పుడూ ప్రేక్షకులను ఆసక్తికరమే. అభిమానులు తమ ఇష్టమైన నటుడు-నటి పెళ్లి చేసుకుంటే పండుగ చేసుకుంటారు. కానీ, అదే వాళ్లు విడిపోతే బాధపడతారు. ఒకప్పుడు పెళ్లి అంటే జీవితాంతం బంధం అనుకునేవారు. ఇప్పుడు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొద్ది రోజుల్లోనే విడిపోతున్నారు. తమ మూడు ముళ్ల బంధాన్ని మున్నాళ్లకే కట్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ హీరోయిన్ తన మూడో భార్య కూడా విడాకులిచ్చి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? విడాకులకు కారణమేంటీ?
హీరోయిన్ మీరా వాసుదేవన్ (Meera Vasudevan) మరోసారి విడాకులు తీసుకుంది. ఈమె గతేడాది మూడో పెళ్లి చేసుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. అయితే ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. భేదాభిప్రాయాలతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ పోస్ట్ పెట్టింది. 'నేను మీరా వాసుదేవన్.. 2025 ఆగస్టు నుంచి సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రస్తుతం నేను చాలా అందమైన, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను' అని రాసుకొచ్చింది. తన పెళ్లి ఫోటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.

బుల్లి తెర,వెండి తెరపై తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మీరా వాసుదేవన్ (Meera Vasudevan) మరోసారి వ్యక్తిగత కారణాలతో వార్తల్లోకి వచ్చారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు పేటాకులు కాగా.. గత ఏడాది చేసుకున్న మూడో పెళ్లి కూడా ముగిసినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఆమె 2024 మేలో కోయంబత్తూరులో సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో మూడో పెళ్లి చేసుకున్నారు. 'కుటుంబవిలక్కు' మలయాళ సీరియల్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. నాలుగేళ్ల పరిచయం తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరూ ఎంతోకాలం కలిసి ఉండలేకపోయారు.
తాజాగా మీరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో "2025 ఆగస్టు నుంచి నేను సింగిల్. ఇప్పుడు నేను ప్రశాంతమైన, అందమైన జీవితాన్ని గడుపుతున్నా" అంటూ పెట్టిన స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో మీరా వాసుదేవన్ - విపిన్ పుత్యాంగం లు విడాకుల ప్రకటన చేసినట్టు అయింది. అంతేకాకుండా, ఆమె తన పెళ్లి ఫోటోలు, వీడియోలు అన్నింటినీ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. దీంతో ఈ బంధం పూర్తిగా ముగిసినట్లు స్పష్టమైంది. కామెంట్ సెక్షన్‌ను కూడా డిసేబుల్ చేయడం ద్వారా నెగటివ్ కామెంట్లు, ట్రోలింగ్‌కి ముందే అడ్డుకట్ట వేసింది హీరోయిన్.
మీరా వాసుదేవన్ జీవితంలో ఇది మూడో విడాకులు. ఆమె తొలి పెళ్లి 2005లో సినీ వ్యక్తి విశాల్ అగర్వాల్‌తో జరిగింది. కానీ ఐదేళ్లలోనే ఆ దాంపత్యం ముగిసింది. అనంతరం 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ అటువంటి సంబంధానికి కూడా నాలుగేళ్లకు ముగింపు పలికారు. చివరగా కెమెరామెన్ విపిన్‌తో చేసిన వివాహం కూడా ఒకే ఏడాది లోపే ముగిసింది.తన వ్యక్తిగత జీవితంలో వరుసగా మూడు వివాహాలు విఫలమైనా, మీరా మాత్రం ప్రశాంతంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. "జీవితంలో ప్రశాంతతే నాకు ప్రధానమైంది" అని కామెంట్ చేశారు.
మీరా కెరీర్ పరంగా చూస్తే, 2001లో బుల్లితెరపై కనిపించింది. ఆ ఫేమ్ తో "గోల్‌మాల్", "అంజలి ఐ లవ్ యూ" వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. మలయాళంలో "థన్‌మాత్ర" సినిమా ద్వారా విపరీతమైన ప్రశంసలు అందుకుంది. ఇటీవల 'కుటుంబవిలక్కు'లో పోషించిన "సుమిత్ర" పాత్రతో మహిళలలో భారీ ఆదరణ పొందింది. ప్రస్తుతం ఆమె సినిమాలు, సీరియల్స్ రెండిటిలోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు పొందుతోంది. వ్యక్తిగత జీవితం పరంగా వరుస వైఫల్యాలు ఎదురైనా.. కెరీర్ పరంగా మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. మొత్తానికి మీరా వాసుదేవన్ మరోసారి విడాకులతో హాట్ టాపిక్ గా మారారు.


Click it and Unblock the Notifications











