ఆ హీరో బట్టలు తీసేసి.. నాతో అలా.. ఇంటిమేట్ సీన్‌లపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
కథ డిమాండ్ చేసిన మేరకు నటీనటులు ఇంటిమేట్ సీన్స్ చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ నటించాల్సి ఉంటుంది. అయితే ఇది అంత తేలిక కాదు.. ఇందుకు మానసికంగా, శారీరకంగా ఎంతో సన్నద్ధం కావాల్సి ఉంటుంది. చుట్టూ కెమెరాలు, జనం చూస్తుండగా ఆడ, మగల మధ్య అలాంటి సీన్స్ ఎంతో కష్టంతో కూడుకున్న పని. కొందరు నటీనటులైతే ఇలాంటి సీన్స్ ఉన్నాయో లేదో ముందే కనుక్కుని సినిమా నుంచి తప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ ఇంటిమేట్ సీన్స్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌తో సినీ ప్రస్థానం మొదలు
మలయాళలో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు మీరా వాసుదేవన్. ఇటీవల మూడోసారి విడాకులు ఇచ్చేసి ఇండస్ట్రీని కుదిపేశారు. తెలుగులో జేడీ చక్రవర్తి నటించిన గోల్‌మాల్ సినిమాతో 2003లో వెండితెరపై అడుగుపెట్టారు మీరా. ఆ తర్వాత తన మాతృభాష మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. 22 ఏళ్లకు పైగా కెరీర్‌లో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో పలు భాషల్లో నటించారు.

మూడు సార్లు పెళ్లి, విడాకులు
ఇక మీరా వాసుదేవన్ తన సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితం, వివాదాలతోనే వార్తల్లో నిలిచారు. తొలుత 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విశాల్ అగర్వాల్‌ను పెళ్లాడారు మీరా. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగగా.. 2010లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012లో నటుడు జాన్ కోకెన్‌ను వివాహం చేసుకున్న మీరా వాసుదేవన్.. 2016లో ఆయనకు విడాకులిచ్చారు. ఈ దంపతులకు అరిహా అనే కుమారుడు ఉన్నారు. ఎనిమిదేళ్లు ఒంటరిగానే ఉన్న మీరా వాసుదేవన్.. కుటుంబవిళక్కు మూవీలో పరిచయమైన విపిన్‌ను 2024 మేలో మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాది గడిచిందో లేదో విపిన్‌కు కూడా మీరా విడాకులిచ్చి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశారు.
ఆయన ముందే క్షమాపణలు
ప్రస్తుతం ఎక్కడ చూసినా మీరా వాసుదేవన్ గురించే చర్చ జరుగుతుండగా గతంలో తాను నటించిన ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళ దిగ్గజం మోహన్‌లాల్‌తో తన్మత్ర చిత్రంలో నటించారు. ఈ మూవీలో లాల్‌తో ఓ ఇంటిమేట్ సీన్‌లో నటించాల్సి వచ్చింది. ఈ సీన్ అవసరమా? అని మోహన్‌లాల్ సార్‌ని అడిగా. దాంతో ఆయన ఇది సినిమాకు అత్యంత ముఖ్యమైన సన్నివేశమని చెప్పారు. సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఇందులో భార్యాభర్తలుగా నటించిన మా మధ్య బలమైన బంధం, భావోద్వేగాలు నిండి ఉంటాయి అని మీరా వాసుదేవన్ తెలిపారు.
ఆ సీన్ కోసం సవాల్‌గా
ఈ సీన్‌లో మోహన్‌లాల్ గారు పూర్తిగా నగ్నంగా నటించాల్సి రావడంతో దీనిని సవాల్‌గా తీసుకున్నారు. నా గౌరవం గురించి ఎంతో శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకున్న మోహన్‌లాల్ సర్... షూటింగ్‌కు ముందే నాతో ఈ విషయం గురించి చర్చించి క్షమాపణలు చెప్పారు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి అని మోహన్‌లాల్ అన్నారు అని మీరా వాసుదేవన్ గుర్తుచేసుకున్నారు. మోహన్‌లాల్, మీరా వాసుదేవన్‌ల నటన, కథకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ సినిమా ఉత్తమ మలయాళ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.


Click it and Unblock the Notifications











