3 పెళ్లిళ్లతో 17 ఏళ్లు వృథా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

దక్షిణాది సినీ పరిశ్రమలో మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీరా వాసుదేవన్ ( Meera Vasudevan). తాజాగా తన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంపత్య జీవితంలో ఎదురైన సంఘటనలను ఆమె మీడియాతో నిర్భయంగా పంచుకొన్నారు. తన లైఫ్‌లో జరిగిన సంఘటనలు దాచాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమలో నటించడం ద్వారా కెరీర్ ప్రారంభించిన మీరా వాసుదేవన్ వైవాహిక జీవితం వల్ల తన తన కెరీర్ నాశనం అయిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

ముంబైలో జన్మించిన మీరా, తమిళ కుటుంబానికి చెందినవారు. సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్‌లో చదువులు పూర్తి చేసిన ఆమె మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి, తర్వాత సినీ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 2003 సంవత్సరంలో జేడీ చక్రవర్తి హీరోగా నటించిన గోల్‌మాల్ అనే సినిమా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత అంజలి ఐలవ్ యూ అనే సినిమాలో కూడా నటించారు. అయితే మలయాళంలో అవకాశాలు రావడంతో పూర్తిగా మాలీవుడ్‌కే పరిమితయయ్యారు. ఎక్కువగా మలయాళ చిత్రాల్లోనే నటించారు.

Meera Vasudevan Regrets 17 Years Lost in Marriages Says Career Took a Backseat

అయితే కెరీర్‌తో వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మీరా మొదటి వివాహం 2005లో విశాల్ అగర్వాల్‌తో జరిగింది. ఐదేళ్ల పాటు కొనసాగిన ఈ సంబంధం విభేదాల కారణంగా 2010లో ముగిసింది. అనంతరం మలయాళ నటుడు జాన్ కొక్కెన్ ను వివాహం చేసుకున్న ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2016లో రెండో వివాహానికి కూడా ముగింపు పలికారు. రెండు విఫలమైనఫర్ తర్వాత కూడా జీవితంపై ఆశ కోల్పోని మీరా, 2024లో సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియాంకమ్ ను మూడోసారి వివాహం చేసుకున్నారు. అయితే ఈ సంబంధం కూడా ఏడాది లోపే ముగియడంతో మరోసారి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

తాజాగా ఓ ఇంటర్య్వూలో సీనియర్ నటి మీరా వాసుదేవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీరా తన జీవితంపై ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నా జీవితంలో 17 ఏళ్లు మూడు పెళ్లిళ్లలో వృథా చేశాను. ఆ సమయాన్ని నేను తెలివిగా ఉపయోగించి ఉంటే ఇంకా చాలా సాధించేదాన్ని" అని అన్నారు. "నాకు ఇష్టమైన సినిమా, ఫిట్‌నెస్ లేదా నా వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాల్సింది. కానీ నన్ను గౌరవించని, సీరియస్‌గా తీసుకోని వ్యక్తులతోనే కాలం గడిపాను" అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాదు, "ఆ సమయాన్ని నా తల్లిదండ్రులు, కుటుంబంతో గడిపి ఉండాల్సింది" అని కూడా చెప్పాలి.

తన గతాన్ని దాచిపెట్టకుండా మీరా ఓపెన్‌గా మాట్లాడింది. "నేను తప్పులు చేశాను... వాటిని దాచుకోవడం లేదు. ఇప్పుడు జీవితంలో ముందుకు వెళ్లాలి" అని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టి సంతోషంగా ఉన్నానని కూడా చెప్పారు. "మనకు మనసులో ప్రశాంతత లేకపోతే ఇతరుల అంగీకారం కోసం వెతుకుతాం. అప్పుడు వాళ్ల మాటలే నిజమైపోతాయి. కానీ మన అనుభవాల నుంచి నేర్చుకుని ఎదగడం చాలా ముఖ్యం" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన అనుభవాలను పంచుకుంటూ మీరా, "జీవితంలో కొన్ని నిర్ణయాలు తప్పవుతాయి. కానీ వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగడం చాలా ముఖ్యం" అని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X