ఫ్లాపులతో ఐరన్‌లెగ్‌గా... కట్ చేస్తే 12 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా, ఆ హీరోయిన్ ఎవరంటే?

నటీనటుల జీవితం తెరమీద చూపించినట్లుగా అందంగా ఉండదు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, విషాదాలతో బతుకు బండిని నెట్టుకొచ్చేవారు ఎందరో. కొందరినీ మాత్రం అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వరిస్తుందో తెలియదు. జీవితంలో కొన్ని పొగొట్టుకున్న వారికి... అంతకుమించిన అదృష్టం వరిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ కోవలోకే వస్తుంది ఈ హీరోయిన్ జీవితం. ఆమె ఎవరు? ఆ హీరోయిన్‌ను వరించిన అదృష్టం ఏంటీ? ఈ వివరాల్లోకి వెళితే..

మిస్ ఇండియా విజేతగా
సదరు నటి ఎవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ అదితి ఆర్య. వరుస ఫ్లాపులతో కష్టాలను, అవమానాలను ఎదుర్కోన్న ఈ నటి ఇప్పుడు ఏకంగా 12 వేల కోట్ల ఆస్తికి అధిపతి కావడం విశేషం. 18 సెప్టెంబర్ 1993న చండీగఢ్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ గ్రాడ్యుయేషన్ అనంతరం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ అయ్యారు. మోడలింగ్ వైపు అడుగులు వేసిన అదితి.. 2015లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అదే ఏడాది మిస్ వరల్డ్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు.

Meet actress who faces flops in Acting career daughter-in-law of man with over Rs 12000 crore net worth

ఇజం సినిమాతో టాలీవుడ్‌లోకి
మిస్ ఇండియా పోటీలలో విజయం సాధించిన తర్వాత సినీరంగం నుంచి అదితి ఆర్యకు అవకాశాలు వచ్చాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇజం సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. అనంతరం పంజాబీ, కన్నడ, హిందీ భాషలలో ఒకటి ఆరా సినిమాలు చేశారు అదితి. 2021లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 83 మూవీలో అదితి కీలకపాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత ఆమెకు అంతగా అవకాశాలు దక్కలేదు. దురదృష్టవశాత్తూ అదితి నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది.

చదువులో టాపర్
సినీ జీవితంలో ఇబ్బందులు పడినా తొలి నుంచి చదువుపై ఆసక్తి ఉండటంతో 2023లో యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి అదితి ఎంబీఏ పట్టా పొంది పలువురి ప్రశంసలు పొందారు. ఇలాంటి దశలో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. భారతదేశంలోని సంపన్నుల్లో ఒకరు, కోటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్‌తో ప్రేమాయణం అదితి జీవితాన్ని మలుపు తిప్పింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపడంతో 2023లో ఉదయ్‌పూర్‌లోని తాజ్ ఫతే ప్రకాష్ ప్యాలెస్‌లో జై కోటక్- అదితి ఆర్యల వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి అంబానీలతో పాటు దేశంలోని సంపన్నులు, రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

12 వేల కోట్ల సంపదకు అధిపతి
ఆదితి మామగారు ఉదయ్ కోటక్ సంపద విలువ 14.4 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 1.2 కోట్ల రూపాయలు). భారత్‌లోని సంపన్నుల జాబితాలో ఉదయ్ కోటక్ టాప్ 10లో నిలిచారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, లైఫ్ ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ రంగాల్లో కోటక్ మహీంద్రా గ్రూప్ సేవలు అందిస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌లలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ వీరి కుటుంబానిదే. ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ సంపద 12000 కోట్ల పైమాటే. దాంతో అదితి ఆర్య కూడా కోటక్ కుటుంబానికి కోడలిగా, బిలియనీర్‌గా రాజభోగాలు అనుభవిస్తున్నారు. సినిమాల్లో రాణించలేకపోయినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అదితి తిరుగులేని స్థానానికి చేరుకున్నారు.

Read more about: aditi arya movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X