Niharika Konidela: బికినిలో మెగా డాటర్ నిహారిక హల్‌చల్.. విదేశాల్లో ఫ్రెండ్స్‌తో అలా.. ఫొటోలు వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదల సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక మరికొన్నిసార్లు గ్లామర్ తో కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మొదటిసారి నిహారిక ఎవరు ఊహించని విధంగా బికినీలో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారిపోయింది. పెళ్లయిన తర్వాత ఆమె మరింత చురుగ్గా అయితే సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇక ఆమె పోస్ట్ చేసిన బికినీ ఫోటో వివరాలలోకి వెళితే..

మొదట అలా..
మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు నిహారిక కొణిదెల మొదట యాంకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. పలు ఈటీవీ షోలకు హోస్ట్ వ్యవహరించి మంచి గుర్తింపును అయితే అందుకుంది. ఇక తర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ నటిగా అయితే నిహారికకు మంచి గుర్తింపును అందించింది.

నటనలో మంచి టాలెంట్
ఇక నటిగా గుర్తింపును అందుకున్న తర్వాత ఆమెకు తమిళంలో కూడా ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఇక హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటించింది. 2019లో సూర్యకాంతం అనే సినిమాల్లో కూడా ఆమె గయ్యాలిగా అల్లరి పాత్రలో నటించి బాగానే ఎట్రాక్ట్ చేసింది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నిహారిక చివరగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత
ఇక నటిగా బిజీ అవుతుంది అనుకున్న తరుణంలోనే అనేక పెళ్లి చేశారు. ఒక ప్రముఖ పోలీస్ ఆఫీసర్ కొడుకు అయినా చైతన్య జొన్నలగడ్డ ను పెళ్లి చేసుకున్న ఆమె పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లోకి అయితే ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. అలాగే చిన్న బడ్జెట్లో కూడా సినిమాలను నిర్మించడానికి భర్తను ఒక బిజినెస్ పార్ట్నర్ గా కూడా చేసుకుంది.

విదేశాల్లో నిహారిక
ఇక ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా కూడా నిహారిక తన భర్తతో కలిసి కొన్ని స్పెషల్ లోకేషన్స్ కు కూడా వెళుతుంది. రీసెంట్ గా తన స్నేహితులతో కలిసి ఆమె టర్కీల్లోని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ అమ్మడు ఒక బీచ్ ఒడ్డున హ్యాపీగా ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తోంది. ఇక తన స్నేహితులతో కలిసి ప్రత్యేకంగా ఫోటోలకు కూడా పోస్ట్ చేసింది.

బికినీలో నిహారిక
ఒక ఫోటోలో నిహారిక టాప్ బికినీలో కనిపించింది. ఆమె పక్కనే మరొక ఫ్రెండ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో ఎప్పుడు బికినీలో కనిపించని నిహారిక ఇప్పుడు ఆ విధంగా టాప్ బికినీలో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకోవడంతో ఒక్కసారిగా అది ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారిపోయింది. అలాగే ఆ స్టోరీలో అమ్మడు తన స్నేహితుల గురించి చాలా గొప్పగా వివరణ ఇచ్చింది. ఈ రైడ్ చాలా ఆనందంగా ఉంది అని కూడా ఆమె అందులో తెలియజేసింది.


Click it and Unblock the Notifications











