Lavanya Tripathi బిగ్ బాస్ విన్నర్‌తో మెగా కోడలు లావణ్య కొత్త సిరీస్.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లాడి మెగా కోడలు అయిపోయింది. ఇక మెగా కోడలుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీ అయిపోయిన ఈ భామ.. సినిమాలు చేయదని చాలా మంది అనుకున్నారు. అయితే అందరికీ షాకిస్తూ... మెగా కోడలు లావణ్య ఓ కొత్త వెబ్ సిరీస్ ను ప్రకటించింది. అది కూడా బిగ్ బాస్ విన్నర్ తో కలిసి ఈ సిరీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవలే కొన్ని నెలల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమ పెళ్లి చేసుకుని మెగా కోడలుగా సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత ప్రస్తుతం లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఈ భామ. ఇటీవల భర్త వరుణ్ తేజ్ తో కలిసి హనీమూన్ వెళ్లొచ్చింది. అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంది. ఇక హనీమూన్ తర్వాత ఈ భామ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంది.'

Mega Daughter in Law Lavanya Tripathi Annnounced Her First Web Series Miss Perfect After Her Marriage Full Details Here

ఇక తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కూడా. తనని తాను ప్రేమించుకోవాలి.. హ్యూమన్ బియింగ్ గా ఉండాలి.. సోషల్ మీడియాకు తక్కువగా టైం కేటాయించాలి అంటూ మూడింటిని రిజల్యూషన్స్ గా పెట్టుకుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరం కానుందని వార్తలు వచ్చాయి. కానీ అందరికీ షాక్ ఇస్తూ.. తాను ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Mega Daughter in Law Lavanya Tripathi Annnounced Her First Web Series Miss Perfect After Her Marriage Full Details Here

లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన నెక్స్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి.. బిగ్ బాస్ తెలుగు 4 విన్నర్ అభిజీత్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతుంది. ఇక ఈ సిరీస్ కు 'మిస్ పర్ఫెక్ట్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ సిరీస్ త్వరలో రానుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్" లో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

లావణ్య త్రిపాఠి, అభిజిత్, అభిజ్ఞ.. ముగ్గురు కీలక పాత్రల్లో నటించనున్నారని తెలుస్తోంది. అయితే వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఈ సిరీస్ తోనే ప్రేక్షకుల ముందుకు మొదటిసారిగా రాబోతుంది. ఈ సిరీస్ కామెడీ డ్రామాగా సాగానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. త్వరలో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ప్రమోషన్స్ తో లావణ్య ప్రేక్షకుల ముందుకి రానుందట.

ఈ సిరీస్ తో లావణ్య ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇక ఇప్పటికే లావణ్య గతంలో ఆల్రెడీ పులి మేక అనే వెబ్ సిరీస్ తో అలరించింది. ఇక వరుణ్ తేజ్ మట్కా సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. లావణ్య చేతిలో ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు.. ఓ సిరీస్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X