మెగా కోడలు vs లావణ్య త్రిపాఠి : మీకు ఏది బాగా నచ్చిందంటే? లావణ్య షాకింగ్ ఆన్సర్!

ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ ను పెళ్లాడి... మెగా కోడలు అయిపోయింది. అయితే లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా రోజులకు ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇక ఈ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే.. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. లావణ్య త్రిపాఠి వర్సెస్ మెగా కోడలు.. వీటిలో ఏది మీకు బాగా ఇష్టం అని ఓ విలకరి క్వశ్చన్ అడగ్గా... లావణ్య త్రిపాఠి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయి.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి... ఉత్తరా ఖండ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఇక వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా మారింది. ఇదిలా ఉంటే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో పడి.. ఆరేళ్లు సీక్రెట్ గా లవ్ చేసింది. ఇక ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు చెప్పి.. పెద్దల మధ్య వరుణ్ తేజ్ ను పెళ్లాడి మెగా కోడలుగా మారిపోయింది. ప్రస్తుతం మెగా కోడలిగా మెగా ఫ్యామిలీలో లావణ్య చాలా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తుంది.

Mega Daughter in Law vs Lavanya Tripathi: Which one do you like better? Lavanyas shocking answer!

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని చాలా మంది అనుకున్నారు. ఇక మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి ఇంటి బాధ్యతలను నిర్వహించనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలకు చెక్ పెడుతూ... తాజాగా లావణ్య త్రిపాఠి ఓ వెబ్ సిరీస్ ప్రకటించింది. 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ చేయగా.. అందులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కీలక పాత్ర పోషించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ తాజాగా అయింది. ఇక ఆ సందర్భంగా ఆమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు లావణ్య ఆసక్తికర ఆన్సర్స్ ఇచ్చారు.

ఇక లావణ్య త్రిపాఠికి ఈ నేపథ్యంలోనే ఓ ప్రశ్న ఎదురు అయింది. లావణ్య త్రిపాఠి వర్సెస్ మెగా కోడలు ఇందులో మీకు ఏ ట్యాగ్ అనేది ఇష్టం అని ఓ విలేకరి ప్రశ్న అడిగింది. దీనికి ఆమె షాకింగ్ ఆన్సర్ చేసింది లావణ్య. తాను కష్టపడి సంపాదించుకున్న పేరు లావణ్య త్రిపాఠి అని... కానీ మెగా కోడలు అనే ట్యాగ్ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పుకువచ్చింది. వరుణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఈ ట్యాగ్ వచ్చిందని వెల్లడించింది.

Mega Daughter in Law vs Lavanya Tripathi: Which one do you like better? Lavanyas shocking answer!

మెగా కోడలు అనే పిలుపు చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పిన లావణ్య త్రిపాఠి... ఆ పేరు అంటేనే ఇష్టం అంటూ చెప్పుకువచ్చింది. పర్ఫెక్షన్ అనేది పెద్ద సమస్య అని దీని వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుందని చెప్పుకువచ్చింది. తాను పర్ఫెక్షనిస్ట్ కాదని... వరుణ్ మాత్రం పర్ఫెక్షనిస్ట్ అంటూ వివరించింది లావణ్య త్రిపాఠి.

పెళ్లి అయిన తర్వాత తన సినిమాల విషయంలో అత్తారింట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని లావణ్య తెలిపారు. ఇలాంటి పాత్రలు చేయవద్దని కూడా ఎవరూ తనతో అనలేదని చెప్పారు. కెరీర్ పరంగా అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని తెలిపారు. మంచి కథ దొరికితే వరణ్ తో కలిసి నటించేందుకు తాను సిద్ధమని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X