For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిహారిక సెన్సేషన్: బోల్డ్ ఫొటోను షేర్ చేసిన మెగా డాటర్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్.!

  By Manoj Kumar P
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కుటుంబాల నుంచి హీరోలు పరిచయం అవుతూ వస్తున్నారు. అయితే, మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం హీరోలతో పాటు ఓ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కూతురైన ఈమె.. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి ప్రవేశించింది. అక్కడ సత్తా చాటడంతో సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, ఇక్కడ అంతగా కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె మరో రంగంలోకి అడుగు పెట్టింది. ఇక, తాజాగా ఈ క్రేజీ భామ ఓ బోల్డ్ ఫొటోను షేర్ చేసింది. దీనికి మెగా ఫ్యాన్స్ షాకింగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. వివరాలు...

  రెండింట్లో సక్సెస్.. అసలైన చోట ఫెయిల్

  రెండింట్లో సక్సెస్.. అసలైన చోట ఫెయిల్

  నిహారిక కెరీర్ ఆరంభంలో ‘ఢీ' అనే డ్యాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరించి మెప్పించింది. దీని తర్వాత ఆమె పలు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించింది. వీటిలో మెగా డాటర్‌ నటన ఆకట్టుకుంది. దీంతో ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ఒక మనసు', ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి సినిమాలతో వచ్చినా అవేమీ హిట్ కాలేదు. దీంతో ఆమెకు నిరాశ తప్పలేదు.

  వాటి రిజల్ట్ ఎఫెక్ట్‌తో గుడ్‌బై చెప్పేసింది

  వాటి రిజల్ట్ ఎఫెక్ట్‌తో గుడ్‌బై చెప్పేసింది

  ఎన్నో అంచనాలతో సినిమాల్లోకి అడుగు పెట్టిన నిహారికకు పరాభవం తప్పలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఈ విషయంలో తన తండ్రి నాగబాబుతో పాటు పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి, సోదరుడు వరుణ్ తేజ్‌ను కూడా ఆమె ఒప్పించిందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అప్పుడు అనుకున్నట్లే ఆమె మరోసారి హీరోయిన్‌గా నటించలేదు.

  అందులో కనిపించాలని చరణ్‌ను ఒప్పించింది

  అందులో కనిపించాలని చరణ్‌ను ఒప్పించింది

  సినిమాల్లో నటించకూడదని నిహారిక నిర్ణయించుకున్నప్పటికీ.. గత ఏడాది విడుదలైన ‘సైరా: నరసింహారెడ్డి'లో మాత్రం ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించింది. తన పెదనాన్న నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో.. అందులో చిన్న క్యారెక్టర్ అయినా ఇవ్వాలని నిర్మాత రామ్ చరణ్‌ను కోరిందీ అమ్మడు. దీనికి అతడితో పాటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఒప్పుకోవడంతో ఆమె ఇందులో కనిపించింది.

  మ్యాడ్ హౌస్‌తో సత్తా చాటుతున్న నిహారిక

  మ్యాడ్ హౌస్‌తో సత్తా చాటుతున్న నిహారిక

  సినిమాలకు బ్రేకిచ్చినప్పటికీ నిహారిక వెబ్ సిరీస్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. గతంలో సొంతంగా ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించిన మెగా డాటర్.. దానిపై ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇవి సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్య ఆమె ‘మ్యాడ్ హౌస్' అనే సిరీస్‌ను నిర్మించింది. ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

  నిహారిక బాధ్యత తీసుకున్న అల్లు అర్జున్

  నిహారిక బాధ్యత తీసుకున్న అల్లు అర్జున్

  సినిమా కెరీర్ పరంగా కష్టాలను ఎదుర్కొన్న నిహారికకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాయం చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం ఓ వార్త వైరల్ అయిపోయింది. దీని ప్రకారం.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నిహారికకు అవకాశం కల్పించాడట బన్నీ. ఇందులో ఆమె ఓ కీలకమైన పాత్రను పోషించబోతుందని అంటున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

  బోల్డ్ ఫొటోను షేర్ చేసిన మెగా డాటర్

  సినిమాలు.. వెబ్ సిరీస్‌లు.. షార్ట్ ఫిల్మ్‌లు.. స్పెషల్ షోలు ఇలా కొద్ది రోజుల వరకు బిజీ బిజీగా గడిపిందీ మెగా డాటర్ నిహారిక. అయితే, ఈ మధ్య అవన్నీ లేకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు, కెరీర్ ఆప్‌డేట్స్‌లను పంచుకుంటోంది. తాజాగా ఆమె ఓ బోల్డ్ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది.

  నిహారిక సెన్సేషన్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్.!

  నిహారిక సెన్సేషన్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్.!

  నిహారిక తన ఎద అందాలు కనిపించేలా ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఆమె కనిపిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఊహించని రీతిలో రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి నిహారిక చేసిన పనికి వాళ్ల నుంచి అభ్యంతరం వస్తుందని అనుకుంటే.. దానికి భిన్నంగా మెగా అభిమానులు ఆమెకు మద్దతుగా కామెట్లు పెడుతున్నారు.

  English summary
  Mega Daughter Niharika Konidela, who is going to be seen in the upcoming Chiranjeevi starrer Sye Raa Narasimha Reddy based on the life of a freedom fighter Uyyalawada Narasimha Reddy, has once again stepped into the role of a producer with a sitcom titled Mad House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X