Niharika Konidela: అందుకే విడాకులు తీసుకున్నా.. జీవితంలో ఎవర్నీ నమ్మకూడదు.. మెగా డాటర్ ఎమోషనల్!
కొణిదెల నాగబాబు కూతురిగా, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల అల్లరి కూతురిగా.. మెగా డాటర్ గా మంచి పేరునే సంపాదించుకుంది నిహారిక కొణిదెల. ముందుగా టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ప్రొడక్షన్ రంగంలోకి కూడా దిగి కెరియర్ లో ముందుకు వెళ్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ నిఖిల్ విజయేంద్ర సింహ చేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. తొలిసారి తాను చైతన్య కృష్ణతో ఎందుకు విడాకులు తీసుకుందో వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. ఇరు కుటంబ సభ్యుల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్న చైతన్య, నిహారికలు... పెళ్లి అయిన ఏడాదిన్నర తర్వాత నుంచే దూరంగా ఉన్నారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. చివరకు అవే నిజం అయ్యాయి. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నిహారిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో విడాకులు ఎందుకు తీసుకుందో చెప్పుకొచ్చింది.

విడాకుల తర్వాత తనపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయని.. కానీ ఎవరైనా పెళ్లి అనేది కలిసుండాలనే చేసుకుంటారని... తాను కూడా అలాగే చేసుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రేమించి, చాలా గ్రాండ్ గా పెళ్లయితే చేసుకున్నాను కానీ ఆ తర్వాత నేను అనుకున్నదీ ఏదీ జరగలేదని వివరించింది. అందుకే ఆ బంధాన్ని ముగించానని క్లారిటీ ఇచ్చింది. కానీ ఆక్రమంలో తాను చాలా బాధపడ్డాడనని, డిప్రెషన్ కు లోనయ్యానని చెప్పుకొచ్చింది. తన స్నహేతులు, కుటుంబ సభ్యులు వల్లే తాను వాటి నుంచి త్వరగా బయటకు వచ్చానని కూడా చెప్పుకొచ్చింది.
బయట ఉన్న ఎవరికీ మన బాధ తెలియదని.. దెబ్బ తగిలిన వారికి మాత్రమే ఆ నొప్పి తెలుస్తుందని నిహారికి చెప్పింది. ఒకరికి దెబ్బ తగిలితే త్వరగానే తగ్గిపోతుందని చెప్పడం చాలా సులువేనని కానీ ఆ గాయం మానడం, దాన్నుంచి బయటకు రావడమే చాలా కష్టం అని వెల్లడించింది. అలాగే తన కుటుంబ సభ్యుల వల్లే తాను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నానని.. తన ఏరోజూ తన అన్నయ్య, అమ్మా, నాన్నలు సమస్యగా భావించలేదని కూడా చెప్పుకొచ్చింది. జీవితంలో అంత సులువుగా ఎవరినీ నమ్మకూడదని.. నాలాగా వెంటనే నమ్మేస్తే జీవితమే పాడపైపోతుందని స్పష్టం చేసింది.

విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్లు కాదని.. ఆ తర్వాత కూడా ఎంతో జీవితం ఉంటుందని చెప్పుకొచ్చింది. కానీ మన పక్కన మన అనే వాళ్లు ఉంటే ఎంత పెద్ద సమస్యను అయినా అధిగమించగలమని.. కానీ మనం జీవితంలో ఎవర్ని ఎంచుకున్నా.. అది స్నేహమైనా, ప్రేమైనా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలని సలహా కూడా ఇచ్చింది. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూను పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











