బ్రాలో నిహారిక కొణిదెల హాట్ షో.. ఫిట్ నెస్ అందాలు ఘాటుగా చూపిస్తూ ట్విన్నింగ్ పిక్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయమై టాలీవుడ్ లో హవాను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కూడా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆమెనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల.
చాలా కాలం క్రితమే పరిచయమైన నిహారికను మెగా డాటర్ గా తెలుగు ఆడియెన్స్ పిలుచుకుంటారు. అయితే నిహారిక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్ కు మాత్రం పెద్దగా నోచుకేలేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తుంటుంది.

సత్తా చాటుతూ..
చిత్ర పరిశ్రమలోకి స్టార్ల వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. అలా టాలీవుడ్ లో ఎంతో మంది తరెంగేట్రం చేశారు. అలా వచ్చిన వారిలో కొందరు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా డాటర్ నిహారిక గురించి. చాలా కాలం క్రితమే తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటి ఏ రంగంలో వీలైతే ఆ రంగంలో తన సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతోంది.

ఆరంభంలోనే మంచి పేరు..
ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల ముందుగా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా 'ఢీ' అనే డ్యాన్స్ షోతో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అందులో మెప్పించిన గ్లామరస్ బ్యూటి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లనూ చేసింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

ప్లాప్ కావడంతో..
ఒకవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణించిన బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల 2016లో వచ్చిన ఒక మనసు సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నిహారిక కొణిదెల తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ మూవీ మాత్రం అనుకున్నంత హిట్ కాలేదు. ఇలా మొదటి సినిమా ప్లాప్ కావడంతో గ్లాండ్ గా ఎంట్రీ ఇవ్వలేకపోయింది ఈ బ్యూటి.

విజయ్ సేతుపతితో మూవీ..
మొదటి సినిమా ఒక మనసు పరాజయం తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది. కానీ, ఇవి కూడా నిహారికకు ఒక్క విజయాన్ని కూడా ఇవ్వలేదు. ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల హీరోయిన్ గా చివరిగా ఓ మంచి రోజు చూసి చెప్తా అనే సినిమాలో నటించింది. ఇందులో విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించాడు. ఇదే కాకుండా చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలోనూ ఒక పాత్రలో మెరిసింది ఈ అమ్మడు.

అలా ఫుల్ బిజీగా..
ఇలా పలు సినిమాలు చేసినా హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయిన నిహారిక వాటికి విరామం తీసుకుంది. ఆ సమయంలోనే చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని పెళ్లి చేసుకుంది ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల. అయితే, పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే వచ్చింది. హీరోయిన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్..
నిర్మాతగా మారిన నిహారిక కొణిదెల 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై నిహారిక 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి విజయం సాధించింది. అలాగే 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది. జీ5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన దీనికి కూడా మంచి స్పందన దక్కింది. దీంతో నిహారిక మరిన్ని వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

బ్రాలో ఫిట్ నెస్ అందాలు..
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫొటోలు పెడుతూ అట్రాక్ట్ చేసే ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది. జిమ్ లో తనతోపాటు వర్కౌట్ చేసిన వితికా షెరు ఈ సెల్ఫీ పిక్స్ తీసింది. ఇందులో ఇద్దరు ట్విన్నింగ్ గా దర్శనం ఇచ్చారు. ఈ ఫొటోల్లో నిహారిక బ్లాక్ బ్రా ధరించి సూపర్ హాట్ గా తన నడుము అందాలను చూపించింది. అలాగే తన ఫిట్ నెస్ బ్యూటిని చూపిస్తూ అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











