స్పోర్ట్స్ డ్రెస్‌లో నిహారిక స్టన్నింగ్ షో: గ్లామర్ ట్రీట్ విషయంలో తగ్గేదేలే అంటూ!
టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా సినీ రంగంలోకి తీసుకు వచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఒకరు. యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేసి అలరించింది. కానీ, కెరీర్ పరంగా సక్సెస్ సాధించలేకపోయింది. అయినా ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో వస్తోంది. ఇక, తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు పిక్‌ను వదిలింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!
అలా ఎంట్రీ.. గ్యాపిచ్చింది:ముందుగా నిహారిక 'ఢీ' షోతో యాంకర్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను చేసింది. ఈ క్రమంలోనే 'ఒక మనసు' మూవీతో హీరోయిన్‌గా ఎంటరై.. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసింది. ఇవి హిట్ కాకపోవడంతో గ్యాపిచ్చింది.

పెళ్లి తర్వాత కూడా అలా:హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయిన నిహారిక కెరీర్‌కు బ్రేక్ ఇవ్వడంతో పాటు చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగించింది. అయితే, గతంలో మాదిరిగా యాక్టింగ్ చేయకున్నా.. నిర్మాతగా మారి 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వంటి సిరీస్‌లు నిర్మించి సక్సెస్‌లను సొంతం చేసుకుంది.

భర్తకు విడాకులు ఇచ్చేసి:తమదైన రీతిలో ఎంజాయ్ చేస్తూ మంచి కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిహారిక - చైతన్య విడాకులు తీసుకున్నారు. తద్వారా రెండున్నరేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, తమకు కాస్త ప్రైవసీని ఇవ్వాలని కోరుకున్నారు.
అలాంటి వాటిలో నటిస్తూ:ఇటీవలే నిహారిక కొణిదెల 'డెడ్ పిక్సల్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌లో ఈ మెగా డాటర్ బోల్డుగా కనిపించింది. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా మాట్లాడింది. ఇక, విడాకుల తర్వాత నిహారిక యాక్టింగ్ మీద ఫుల్‌గా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కొన్ని సిరీస్‌లు, సినిమాల్లోనూ నటించేందుకు ఆమె సిద్ధం అవుతోంది.

అందులో యమ యాక్టివ్:మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ షో చేస్తూ సందడి:పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో నిహారిక కొణిదెల గ్లామర్ విషయంలో పరిమితులు పెట్టుకుని ఉండేది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా క్రమం తప్పకుండా హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తరచూ హైలైట్ అవడంతో పాటు సెన్సేషన్‌గా మారుతోంది.

జిమ్‌లో నిహారిక హాట్ షో:సోషల్ మీడియాలో గీత దాటిసి మరీ రెచ్చిపోతోన్న నిహారిక కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని మరీ సెల్ఫీ తీసుకుంది. దీంతో ఇందులో నిహారిక లేలేత అందాలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ టైంలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











