Niharika Konidela: తేజ్ బావ అందుకే పేరు మార్చుకున్నాడు.. సీక్రెట్ రివీల్ చేసిన మెగా డాటర్
మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన పేరు మార్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గ తేజ్ గా తన పేరును మార్చుకున్నట్లు ప్రకటించారు. అయితే సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకోవడం వెనుక గల కారణాలను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన మేనత్త కొడుకులు అయిన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ల గురించి అనేక కామెంట్లు చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
హీరోగా అనేక సినిమాలు చేసిన సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే తన స్నేహితురాలు కలర్స్ స్వాతితో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి స్ఫెషల్ ప్రమీయర్ వేశారు. అందులో పాల్గొన్న హీరో సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తన పేరును సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈయన పేరు మార్చుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఓసారి ఆయన పేరు మార్చుకున్నారు.

అయితే సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకోవడం వెనకు ఓ కారణం ఉందని.. మెగా డాటర్ నిహారిక కొణిదెల తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన మేనత్త కొడుకుల గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తన బావ సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు తనకు సొంత అన్నల్లాగే అనిపిస్తారని చెప్పుకొచ్చింది. ఒకే దగ్గర పెరగడం వల్ల.. మొత్తం తనకు నలుగురు అన్నయ్యలు ఉన్న ఫీలింగ్ వస్తుందని పేర్కొంది.
అయితే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో తనకు చాలా మంచి బాండింగ్ ఉందని.. వారిద్దరూ చాలా క్లోజ్ అని తెలిపింది. అయితే ముందు నుంచి వీరిద్దరికీ వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం అని.. వీరు ముగ్గురూ మంచి స్నేహితుల్లా కలిసి ఉంటారని చెప్పుకొచ్చింది. అయితే తల్లి మీద విపరీతమైన ప్రేమ కల్గిన సాయి ధరమ్ తేజ్ తన అత్త కోసమే పేరు మార్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. బావ తన ప్రేమను ఇలా వ్యక్త పరిచాడంటూ సంబురపడిపోయింది.
అలాగే తన అత్త విజయ దుర్గను ఎప్పుడు చూసినా.. అచ్చం దేవతలా అనిపిస్తుందని నిహారిక చెప్పుకొచ్చింది. ఎప్పుడూ చీర, పెద్ద బొట్టు, చేతుల నిండా గాజులు, అలాగే ఓ పెద్ద ముక్కు పుడక కూడా పెట్టుకుంటుందని తన అంటే మెగా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం అని వెల్లడించింది. తేజ్ బావ తాజాగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడని.. తనకు చాలా సంతోషంగా ఉందని నిహారిక కొణిదెల స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











