Niharika Konidela: ఫ్యాన్‌కు నిహారిక కొణిదెల బంపర్ ఆఫర్.. మెగా డాటర్ ఏం చేస్తున్నదంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా వచ్చిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటించి మెప్పించింది. అయితే తాజాగా ఈమె.. ఫ్లై విత్ మీ అంటూ చేయందిస్తున్న ఫొటోను షేర్ చేసింది. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ ఫొటోల్లో నిహా అందాలు అద్భతమనే చెప్పాలి. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2016లో ఒక మనసు చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది మెగా డాటర్ నిహారిక. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటనను కనబర్చి మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమా చాలా మందికి నచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం హిట్టు కొట్టలేకపోయింది. అయినప్పటకీ ఆమె యాక్టింగ్ అదిరిపోయిందంటూ.. ఆమెకు మంచి ప్యూచర్ ఉందంటూ చాలా మంది కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరికొన్ని చిత్రాల్లోనూ మెరిసింది.

దాదాపుగా ఐదు సినిమాల్లో నటించిన ఈమె.. ఆ మధ్య ఓ అద్భుతమై వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలను కూడా నిర్మిస్తుంది. అయితే చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి తన కెరియర్ పై ఫోకస్ పెంచేసిందీ ముద్దుగుమ్మ. ఓవైపు తన కెరియన్ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతున్న ఈమె సోషల్ మీడియా వేధికగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లు అభిమానులతో పంచుకుంటుంది. తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు ట్రీట్ ఇస్తోంది.
అయితే తాజాగా నిహారిక కొణిదెల ఇన్ స్టాగ్రామ్ వేధికగా అద్భుతమైన హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుని రచ్చ చేస్తోంది. స్లీవ్ లెస్ డ్రెసులో తన సొగసులను చూపిస్తూ.. ఫ్లై విత్ మీ అంటూ అందరికీ చేయి పెట్టింది. ఆ తర్వాత రెండు చేతులను వెనక్కి పెట్టేసి ఓరకంట చూస్తూ... హాట్ గా ఫొజులు పెట్టింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా నీతో ఎగిరిపోయేందుకు మేము సిద్ధమే అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. వీ కెన్ ఫ్లై బై అవర్ ఓన్ సెల్ఫ్ అంటూ కొందరు, ఓకే లెట్స్ ఫ్లై బేబీ అంటూ మరికొందరు చెప్పుకొచ్చారు. ఐ లవ్ యూ, ఇప్పుడే వెళ్లిపోదాం పదా, నువ్వు ఇచ్చిన ఫోజు చూస్తుంటే నన్నే పిలుస్తున్నట్లు అనిపిస్తుందంటా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఏమనిపిస్తుందో చెప్పేయండి.


Click it and Unblock the Notifications











