Niharika Konidela: సూటయ్యే సూటేసి నిహారిక స్టన్నింగ్ షో.. "మెగా" బ్యూటీ అందాలపై లుక్కేయండి!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఒకే ఒక్క హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె.. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ రచ్చ చేస్తోంది. కేవలం నటన మాత్రమే కాకుండా ప్రొడక్షన్ వైపు కూడా అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సూటయ్యే సూటేసి స్టన్నింగ్ షో చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నాగబాబుకు పుట్టిన ఈ ముద్దుగుమ్మను.. చింరంజీవి, పవన్ కల్యాణ్ లు కూడా సొంత కూతుళ్లుగానే చూస్తుంటారు. మెగా ఫ్యామిలీలో తెగ అల్లరి చేస్తూ.. రచ్చ చేసే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఒక మనసు చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.

ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు ప్రొడ్యూసర్ గానూ చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. భర్తతో విడాకుల తర్వాత నుంచి పూర్తిగా కెరియర్ పైనే దృష్టి సారించిన ఈమె ఓ సినిమాకు సంతకం చేసింది. అలాగే తన ప్రొడక్షన్ లో తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా తన కెరియర్ పనుల్లో చాలా బిజీగా ఉన్న ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.
అంతేకాకుండా అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ.. తన అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా మరో అదిరిపోయే ఔట్ ఫిట్ తో కనిపించి కుర్రకారును కవ్విస్తోంది. పీచ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ లో ఉన్న లాంగ్ కోట్ వేసుకుని అందాలు ఆరబోసింది. కైపెక్కించే లుక్ లో చూస్తూ.. కవ్విస్తోంది. నిహారిక పోస్ట్ చేసిన ఈ ఫొటోలు చూస్తుంటే నిజంగానే కుర్రకారు మతి పోతుంది. అందుకే కామెంట్లు, లైకులతో రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ వివరిస్తున్నారు.
నీ అందాలు వర్ణించలేం.. తెలుగులో నీవు మరిన్ని సినిమాలు చేసి క్యూట్ క్యూట్ గా నటించాలని కామెంట్ల రూపంలో కోరుతున్న వారి అభిమానులు. ఓ నెటిజెన్ అయితే ఐ లవ్ యూ నిహా బంగారం అంటూ రాసుకొచ్చాడు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఆమె ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.


Click it and Unblock the Notifications











