Niharika: మెగా డాటర్ గ్లామర్ డోస్.. ఇది అసలు ఊహించి ఉండరు.. ఘాటైన స్టిల్స్ వైరల్!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోలందరు కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి అమ్మాయి నిహారిక అని అందరికి తెలిసిన విషయమే. మంచి చురుకుదనం కలిగిన నిహారిక టెలివిజన్, సినిమా, వెబ్ సీరీస్ అంటూ అన్ని రంగాల్లో తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇక నిహారిక అప్పుడప్పుడు గ్లామర్ డోస్ తో కూడా షాక్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాలలోకి వెళితే...
మొదట అలా స్టార్ట్:మెగా డాటర్ అనే బ్రాండ్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నిహారిక కొణిదెల. ఈ అమ్మడు యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత వెబ్ సిరీస్ లతో నటిగా తనని తాను పరీక్షించుకున్నారు. ఇక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పై తన అదృష్టం పరీక్షించుకున్నారు. ఆ సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకున్న కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.

తమిళంలో కూడా:తరువాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే సక్సెస్ మాత్రం ఆమెని వరించలేదు. నటిగా మాత్రం ఆమె అందరికంటే భిన్నంగా ప్రయత్నాలు అయితే చేసింది. ఇక తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయ్ సేతుపతికి జోడీగా ఒక సినిమాలో నటించారు. ఆ మూవీ కూడా సక్సెస్ కాలేదు. నటిగా ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ కి తగ్గ పాత్రలు సినిమాలో మాత్రం రాలేదు.
కంటెంట్ ఉన్న వెబ్ సీరీస్:హైపర్ యాక్టివ్ గా ఉండే నిహారికకి ఎక్కువగా సెన్సిటివ్ రోల్స్ సినిమాలలో వచ్చాయి. అలాగే పలు మంచి కంటెంట్ ఉన్న వెబ్ సీరీస్ లు చేసింది. ఇక ఇదిలా ఉంటే నిర్మాతగా ప్రస్తుతం బిజీ అయిన ఈమె పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ ద్వారానే వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ స్పేస్ లోకి వచ్చి ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ అనే వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ భాగా సక్సెస్ అయ్యింది.

ఊహించని గ్లామర్ డోస్:ఇప్పుడు నిర్మాతగా బిగ్ స్క్రీన్ పై కూడా తన అదృష్టం పరీక్షుంచుకోవాలని నిహారిక భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ కొత్త ఆఫీస్ కూడా స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే నిహారిక మళ్ళీ హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెడుతుందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆ రేంజ్ లో ఆమె గ్లామర్ డోస్ తో షాక్ ఇస్తోంది.
ఆ అందాలు హైలెట్:ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.. కాస్తా గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ నిహారిక అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. జీన్ టైప్ అవుట్ ఫిట్ తో ఈమె షేర్ చేసిన ఫోటోలకి నెటిజన్లు కూడా ఫిదా అవుతూ ఉండటం విశేషం. ఒకవైపు నడుము అందాలు మరోవైపు ఎద అందాలతో అమ్మడు నెవ్వర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చింది. మరి రాబోయే రోజుల్లో నిహారిక ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











