బోల్డ్ బెడ్ సీన్ అనగానే నిహారిక షాకింగ్ రియాక్షన్.. ఆ సినిమా చేయనని చెప్పేసిందట!

టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక తన ఫ్యామిలి హీరోల సపోర్ట్ లేకుండా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. కెరీర్ మొదట్లో యాంకర్ గా కాస్త హడావుడి చేసి.. ఆ తరువాత వెబ్ సిరీస్ లలో నటించిన ఈ అల్లరి పిల్ల బిగ్ స్క్రీన్ పై కూడా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అమ్మడు హీరోయిన్ గా ఇంకా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోతోంది.

Recommended Video

Chiranjeevi's Acharya Story Out
గ్లామర్ షో..

గ్లామర్ షో..

ఇటీవల ఎందుకో గాని నిహారిక ఎప్పుడు లేని విధంగా కాస్త గ్లామర్ టచ్ ఇస్తోంది. ఇంతకుముందు గ్లామర్ గర్ల్ లాగా దర్శనమిచ్చినప్పటికి ఈ రేంజ్ లో అయితే కనిపించలేదు. కాస్త హాట్ నెస్ పెంచుతూ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా కుర్రాళ్లను ఆకర్షించింది. అలాగే యష్ మాస్టర్ తో చేసిన ఒక డ్యాన్స్ వీడియో కూడా రీసెంట్ గా వైరల్ అయ్యింది. నిహారిక ఇలా కూడా కనిపించగలదా అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

 ఆఫర్స్ బాగానే వస్తున్నాయి..

ఆఫర్స్ బాగానే వస్తున్నాయి..

నిహారిక మెగా డాటర్ కాబట్టి సినిమా అవకాశాలు రప్పించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఈ క్యూట్ గర్ల్ మాత్రం తనకు ఆ విదంగా వచ్చే రోల్స్ వద్దని చెబుతోంది. సొంతంగా కష్టపడి అవకాశాలు తెచ్చుకోవడమే తనకు ఇష్టమని చెబుతోంది. అయితే నిహరికకు కొన్ని సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయట.. కానీ ఆ పాత్రలు ఆమెకు నచ్చడం లేదట. కేవలం తనకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తానని నమ్మకంగా చెబుతోంది.

బోల్డ్ సీన్ అనగానే...

బోల్డ్ సీన్ అనగానే...

ఇటీవల నిహారికకు తమిళ్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందట. అయితే ఆ పాత్ర బాగానే ఉన్నప్పటికీ రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉందని నో చెప్పేసిందట. బోల్డ్ బెడ్ సీన్ లో నటించడం సినిమాలో అవసరమే అయినప్పటికీ అందుకు ఆమె ఒప్పుకోలేదట. ఎందుకంటే తన బ్యాక్ గ్రౌండ్ కారణంగా అలాంటి ఆఫర్స్ కి ఒప్పుకోలేను అని నిర్మాతకు డైరెక్ట్ గా చెప్పేసినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

రూమర్స్ రాకుండా..

రూమర్స్ రాకుండా..

మెగా డాటర్ నిహారిక రూమర్స్, గాసిప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎలాంటి రూమర్ వచ్చినా వెంటనే వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఇలానే అమ్మడు ఒక కుర్ర హీరోతో లవ్ లో ఉన్నట్లు రూమర్స్ రాగానే మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చింది. అంతలా తన కెరీర్ పై నిహారిక బాధ్యతగా నడుచుకుంటుంది. ఇక ఇప్పటికే తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమా చేసిన నిహారిక త్వరలో ఆచార్య సినిమాలో కూడా మరొక కొత్త తరహాపాత్రలో కనిపించబోతోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X