Daddy Movie మెగాస్టార్ కూతురు రీ ఎంట్రీ.. గ్లామరస్ బ్యూటీగా.. ఫొటోస్ వైరల్
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన వాళ్ళు ఇప్పుడు ఊహించిన విధంగా సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించే స్థాయికి వచ్చారు. అప్పుడే వీరు పెద్దగా అయిపోయారా అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు కూడా. ప్రస్తుతం తేజ సజ్జా ఆకాష్ పూరి ఇలా కొంతమంది లీడ్ రోల్స్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి డాడి సినిమాలో మెగాస్టార్ కూతురు ఐశ్వర్య పాత్రలో కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

రీ ఎంట్రీలు
చైల్డ్ ఆర్టిస్టులు హఠాత్తుగా ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న విధానం వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది కేవలం సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా కథానాయకులుగా కూడా కనిపిస్తున్నారు. ఇక అమ్మాయిలు కూడా అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం విశేషం. డాడీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క మల్హోత్రా కూడా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రెండు పాత్రల్లో..
2001లో మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమా ఓ వర్గం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించగా రాజేంద్రప్రసాద్ మెగాస్టార్ చిరంజీవికి స్నేహితుడు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో అనుష్క మల్హోత్రా.. అక్షయ, ఐశ్వర్య పాత్రల్లో కనిపించింది.

గారలా కూతురిగా..
డాడీ సినిమాలో అనుష్క నటించిన విధానం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్ అయింది. ఒక తండ్రితో గారాల కూతురు ఏ విధంగా ఉంటుంది అనే పాత్రను ఆమె చేసిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం ఆ సినిమా సక్సెస్ కాలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలో ఏడవడం ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేదు.

సాంగ్స్ హైలెట్
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అందులో పాటలు మాత్రం ఇప్పటికే ఆల్ టైం బెస్ట్ హిట్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా తండ్రి కూతుర్లకు సంబంధించిన మూమెంట్స్ గుర్తుకొస్తే మాత్రం డాడీ సినిమాలోని గుమ్మడి గుమ్మడి అనే పాట ఎక్కువగా హైలెట్ అవుతుంది. ఈ సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కగా ఎస్ఏ. రాజ్ కుమార్ సంగీతమందించారు.

చేసింది రెండు సినిమాలే
డాడీ సినిమాలో నటించిన అనుష్క మల్హోత్రా ముంబై కి చెందిన అమ్మాయి. ఎంతోమందిని ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్ గా ఆమెని దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే అనుష్క 2002లో 'మీరే యార్ కి షాదీ హై' అనే మరో హిందీ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే నటించింది. ఇక ఆ తర్వాత ఆమె చదువులో బిజీగా మారిపోయి ఆ తర్వాత విదేశాల్లోకి కూడా వెళ్లిపోయింది.
Recommended Video


మరోసారి రీ ఎంట్రీ?
ప్రస్తుతం అనుష్క మల్హోత్రా ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా రెగ్యులర్గా ఫోటోలను పోస్ట్ చేస్తూ నిటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఆమె త్వరలోనే ఒక కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా వెండి తెరకు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే డాన్స్ అలాగే ఇతర యాక్టింగ్ స్కిల్స్ విషయంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం. మరి ఆమె తెలుగులో ఎప్పుడూ రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











