Vishwambhara త్రిషకు మెగాస్టార్ చిరంజీవి వెరైటీ గిఫ్ట్... ఆనందంతో పొంగిపోయిన సుందరి!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సరైన హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆచితూచి మరీ ఈ సారి బింబిసార దర్శకుడు వశిష్టతో కలిసి విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్​గా చేస్తోంది. అయితే ఈమె కోసం చిరు ఓ స్పెషల్ అండ్ వెరైటీ గిఫ్ట్ ఇచ్చి సర్​ప్రైజ్ చేశారు. అది చూసిన త్రిష దాన్ని అభిమానులతో పంచుకుంటూ తెగ సంబరపడిపోయింది. దాని గురించే ఈ కథనం.

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో తన స్టార్ డమ్​కు తగ్గట్టు ఇప్పటివరకు సరైన హిట్​ను దక్కించుకోలేదు. ఖైదీ నెంబర్ 150, సైర నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ ఇవన్నీ పాజిటివ్ టాక్ దక్కించుకున్న భారీ వసూళ్లను సాధించలేదు. ఇక భారీ కలెక్షన్లను అందుకున్న వాల్తేరు వీరయ్య మల్టీస్టారర్​. ఆ సక్సెస్​లో రవితేజ పాత్ర కూడా ఉంది. ఇక ఆచార్య, భోళాశంకర్ కూడా డిజాస్టర్స్​ను అందుకున్నాయి. అంటే చిరు సింగిల్​గా భారీ వసూళ్లతో కూడిన విజయాన్ని దక్కించుకోలేదు. మరోవైపు బాలయ్య మాత్రం హ్యాట్రిక్​ హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

Megastar Chiranjeevi Sent A Special Variety Gift to Heroine Trisha Full Details Here

ఈ క్రమంలోనే ఆయన ఆచితూచి మరీ ఈ సారి బింబిసార దర్శకుడు వశిష్టతో కలిసి విశ్వంభర సినిమా చేస్తున్నారు. విశ్వానికి మించి అనేది ఉపశీర్షిక. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా దీన్ని ముస్తాబు చేస్తున్నారు. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెత్​తో రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే సాధారణంగా చిరుకు బహుమతులు ఇచ్చే అలవాటు ఉంటుంది. అలా తాజాగా త్రిషకు ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించారు. టెంపరేచర్ కంట్రోల్డ్ ఫాన్సీ మగ్​ను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ థ్యాంక్య్​ అని చెప్పుకొచ్చింది. కాగా, 2006లో రిలీజైన స్టాలిన్‌ చిత్రంలో చిరు - త్రిష కలిసి నటించి వినోదాన్ని పంచారు. మళ్లీ దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

Megastar Chiranjeevi Sent A Special Variety Gift to Heroine Trisha Full Details Here

ఇకపోతే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఛాయాగ్రహణం - ఛోటా కె.నాయుడు, ప్రొడక్షన్‌ డిజైన్‌ - ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి, సాహిత్యం - శివశక్తి దత్తా, చంద్రబోస్‌ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Megastar Chiranjeevi Sent A Special Variety Gift to Heroine Trisha Full Details Here

మరోవైపు త్రిష కూడా సెకండ్ ఇన్నింగ్స్​లో జోరు చూపిస్తోంది. మరింత గ్లామర్​ అండ్ యాక్టింగ్​తో ఆక్టటుకుంటూ ముందుకుపోతోంది. ఆ మధ్య, పొన్నియిన్ సెల్వెన్​లో అయితే అందాల తార ఐశ్వర్య రాయ్​నే తన అందంతో బీట్ చేసింది. అనంతరం లియోతో పాటు మరో చిత్రంలోనూ సందడి చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో థగ్స్ లైఫ్​, ఐడెంటిటీ, రామ్, విదా ముయార్చి చిత్రాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X