మెగాస్టార్ సినిమాలో మరోసారి సీనియర్ స్టార్ హీరోయిన్..!
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండడం మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ మళయాళం లుసిఫర్ రీమేక్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది నుంచి ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మొదట డైరెక్టర్స్ గా సుజిత్, ఆ తరువాత వివి.వినాయక్ ను అనునున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అఫీషియల్ గా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాతో వర్క్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆ దర్శకుడు ప్రస్తుతం ప్రాజెక్ట్ కు సంబంధించిన పాత్రలను ఫైనల్ చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది.

నయనతారను కూడా ఒక క్యారెక్టర్ కోసం ఫిక్స్ చేసినట్లుగా కూడా టాక్ అయితే వస్తోంది. దర్శకుడు ఇటీవల హీరోయిన్ డేట్స్ కోసం ఆమె మేనేజర్ ను కూడా సంప్రదించినట్లు సమాచారం. ఇదివరకే నయనతార మెగాస్టార్ సైరా సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక మరోసారి ఆమె డిఫరెంట్ పాత్రలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











