దిల్ రాజు సినిమాలో మేఘా ఆకాష్‌కు ఛాన్స్.. హీరో ఎవరంటే!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఏడాది పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. గత ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఎఫ్2 చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ తో మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదే విధంగా దిల్ రాజు చిన్న చిత్రాలని నిర్మించి విజయాలు అందుకోవడంలో దిట్ట. యువ హీరో రాజ్ తరుణ్ తో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడిగా మేఘా ఆకాష్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేఘా ఆకాష్ నితిన్ సరసన లై, ఛల్ మోహన్ రంగ చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో మేఘా ఆకాష్ కు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. తాజాగా దిల్ రాజ్ నిర్మించే చిత్రంలో మేఘా ఆకాష్ కు ఛాన్స్ దక్కింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే మేఘా ఆకాష్ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఈ చిత్రం మరో అవకాశం అని చెప్పొచ్చు.

Megha Akash to romance with young hero Raj Tarun in Dil Raju film

ఆడు మగాడ్రా బుజ్జి ఫేమ్ కృష్ణారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నీదీ నాదీ ఒకటే లోకం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ కి కూడా ఈ చిత్ర విజయం చాలా అవసరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X