న్యూడ్‌గా చేసింది నేను కాదు: ‘ఏడు చేపల కథ’ హీరోయిన్ మేఘనా చౌదరి!
'ఏడు చేపల కథ' పేరుతో ఇటీవల విడుదలైన ఓ సినిమా టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అడల్ట్ కామెడీ కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడం, ఇప్పటి వరకు తెలుగులో ఎన్నడూ లేని విధంగా సూపర్ హాట్‌గా సీన్లు ఉండటంతో.... ఈ టీజర్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మేఘనా చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. టీజర్లో ఎక్కువగా కనిపించింది నేనే అయినప్పటికీ పేరు మాత్రం వేరే వారికి పోతోందని తెలిపారు. టీజర్లో తాను ఏ సీన్లో కనిపించానో, ఎలాంటి డ్రెస్ వేసుకున్నానో కూడా వివరించారు.

ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?
‘ఏడు చేపల కథ' టీజర్ చూస్తుంటే ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది... మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? మీరు మీ ఫ్యామిలీతో సినిమా చూస్తారా? అనే పశ్నకు మేఘనా చౌదరి పాజిటివ్‌గా స్పందించారు. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? అనేది వారి ఇష్టం. కొన్ని ఫ్యామిలీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్లంతా ఎలాంటి సినిమాకైనా కలిసి వెళ్తారు. కొంత మంది చాలా రిస్ట్రిక్షన్లతో ఉంటారు. కొంత మంది థియేటర్లకే వెళ్లరు. నేనైతే ఈ సినిమాను నా ఫ్యామిలీతో చూస్తాను... అని మేఘనా చౌదరి తెలిపారు.

సినిమా పూర్తి కాలేదు
సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు, పబ్లిసిటీ స్టంట్ కోసమే టీజర్ రిలీజ్ చేశారు అనే వార్తలపై మేఘనా చౌదరి మాట్లాడుతూ... ‘‘సినిమా అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రేక్షకుల ఆదరణ కోసమే టీజర్ రిలీజ్ చేయడం జరిగింది'' అన్నారు.

మా ఇంట్లో చాలా ఆంక్షలు ఉంటాయి
మా ఇంట్లో చాలా పూజలు, చాలా ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రొఫెషన్ వైజ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఎఫ్ఎం అనే మరో సినిమాలో చేస్తున్నాను. దీంతో పాటు రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. గంగా అనే మరో మూవీ అగ్రిమెంట్ మీద సైన్ చేయబోతున్నాను. అదొక డివోషనల్ మూవీ అని తెలిపారు.

లేట్ నైట్ పార్టీలు, పబ్బులు అలవాటు లేదు
లేట్ నైట్ పార్టీలు, పబ్బులకు తిరిగే అలవాటు లేదు. ఔట్ డోర్ షూటింగులకు వెళ్లినపుడు కూడా లేట్ నైట్ వరకు ఉండే పార్టీలకు దూరంగానే ఉంటాను అని మేఘన తెలిపారు.

కమిట్మెంట్ ఇవ్వలేదు, ఎవరికీ లొంగిపోలేదు
ఈ సినిమాలో కమిట్మెంట్స్ లాంటివి ఏమీ లేవు. జెన్యూన్ ప్రాజెక్ట్. అయితే కొన్ని ప్రాజెక్టుల విషయంలో అడిగారు. ఇండస్ట్రీకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది. అందరి మెంటాలిటీ ఇక్కడ ఒకేలా ఉండదు. కొంత మంది అలాంటి వారు కూడా ఉంటారు. వారికి లొంగిపోయి ఎప్పుడూ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ కాకుంటే మరో ప్రాజెక్ట్ వస్తుంది. ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయని తెలిపారు.

ఇంట్లో ప్రతీ సీన్ వివరించి చెప్పలేం
ఒక ప్రాజెక్ట్ చేసేపుడు ఇంట్లో డిస్కస్ చేస్తాను. మా మమ్మీకి ప్రతి ప్రాజెక్ట్ గురించి చెబుతాను. అంతే కానీ ఇలాంటి సీన్లు, అలాంటి సీన్లు అని వివరించి చెప్పలేం. షాట్ అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా జరుగుతుంది అనేది మనకు ముందే తెలియదు.

నాకు వాళ్లంతా బాయ్ ఫ్రెండ్సే
నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను... నా ఫ్యాన్స్ అందరూ నా బాయ్ ఫ్రెండ్సే. నేను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను అని ఈ సందర్భంగా మేఘనా చౌదరి స్పష్టం చేశారు.
న్యూడ్‌గా కనిపించేది నేను కాదు
టీజర్లో చూస్తే నేనే ఎక్కువ సార్లు కనిపించాను. కానీ థంబ్‌లో బిగ్ బాస్ భాను ఫోటో వేసి హైలెట్ చేస్తున్నారు. టీజర్లో న్యూడ్ గా ఉన్నది నేను కాదు. నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకుని కనిపించానని మేఘన తన సీన్ గురించి వివరించారు.


Click it and Unblock the Notifications











