డైలమాలో పడ్డ హనీ, కన్నడ పరిశ్రమపైనే మెహ్రీన్ ఆశలు

టాలీవుడ్ లో బాగానే సెటిల్ అయిపోతోంది అనుకుంటోన్న తరుణంలో పంజాబీ బ్యూటీ మెహ్రిన్ కౌర్ ఉన్నట్లుండి తట్టా బుట్టా సర్దేసేందుకు సిద్ధమయిపోతోంది. అదేంటి నిన్న మొన్నటివరకూ బాగానే ఆఫర్లు అందుకుంది కదా సడన్ గా ఏమయిందంటారా? నిన్నటి వరకూ బాగనే ఉన్నప్పటికీ, అమ్మడికి భవిష్యత్తే ఆశాజనకంగా కనిపించడంలేదట.

కృష్ణగాడి వీర ప్రేమగాథలో చక్కని నటన, హావభావలతో ఆకట్టుకున్న మెహ్రీన్ కౌర్, ఆ తరువాత చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. అయితే, ఆఫర్లు అయితే అందుకుంది కానీ, అందులో ఒక్కదాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయిది. మొదటి సినిమాలో చూపించిన ప్రతిభలో సగం కూడా చూపించకపోవడంతో అమ్మడి నటన జనాలకు తొందరగానే బోర్ కొట్టేసింది. ఇక ఎఫ్ టు ఎఫ్ లో హనీ ఈజ్ ద బెస్ట్, అంటూ మురిపించినా, అది యాక్షన్ కు తక్కువ ఓవర్ యాక్షన్ కు ఎక్కువగా ఉండటంతో ఆమెకు పెద్దగా మార్కులు పడలేదు.

Mehreen career in Tollywood hits a road block, Back to back flops ruins

కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం, చాణక్య, ఎంతమంచి వాడవురా, అశ్వత్థామ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యేసరికి అమ్మడు పూర్తిగా డీలా పడిపోయింది. ఇక తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకుంది కానీ, అక్కడా చుక్కే ఎదురైంది. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు ఒక్క ఆఫర్ కూడా లేదని తెలుస్తోంది. దీంతో అమ్మడు కన్నడ చిత్రసీమకు పయనమైందని సమాచారం.

కన్నడ నాట నుంచి పిలుపు అందుకోవడంతో ఇప్పుడు అటువైపు దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది మెహ్రీన్. దీంతో పాటూ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ల నుంచి కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయట అమ్మడికి. మరి ఈ అవకాశాలనైనా అమ్మడు చక్కగా సద్వినియోగం చేసుకుంటుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X