బికినీతో కనిపించి షాకిచ్చిన మెహ్రీన్: తొలిసారి ఇంత హాట్‌గా F3 హీరోయిన్ ఫోజులు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది భామలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొందరు మాత్రమే ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో గుర్తింపును దక్కించుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మెహ్రీన్ ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్
నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనే సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే క్యూట్‌నెస్‌తో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటూ చాలా కాలంగా హవాను చూపిస్తూ ముందుకెళ్తోంది.

హిట్ సినిమాలు... అన్ని భాషల్లోనూ
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈ ముద్దుగుమ్మ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు', 'ఎఫ్2', 'రాజా ది గ్రేట్', 'అశ్వద్ధామ' వంటి విజయాలను సొంతం చేసుకుంది. అలాగే, హిందీ, తమిళం, పంజాబీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

అతడితో లవ్ ట్రాక్.. ఎంగేజ్‌మెంట్
కెరీర్ పరంగా మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయ్‌తో లవ్ ట్రాక్ కూడా నడిపించింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం అతడితో నిశ్చితార్థం చేసుకుంది.

నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుందిగా
పెళ్లికి కొద్ది రోజుల ముందే భవ్య బిష్ణోయ్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు, ఇకపై అతడితో, అతడి కుటుంబంతో తనకెలాంటి సంబంధం ఉండదని తేల్చేసిందామె. అప్పటి నుంచి మరిన్ని సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ 'ఎఫ్3' సహా పలు చిత్రాలు చేస్తోంది.

అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగానే
చాలా భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే సినిమా అప్‌డేట్లను కూడా తరచుగా ఇస్తోంది. ఇప్పటికే ఈ బబ్లీ హీరోయిన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంటోంది.

అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ కూడా
టాలీవుడ్‌లోని మిగిలిన యంగ్ హీరోయిన్లతో పోలిస్తే మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ బ్యూటీ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసి కుర్రాళ్లలో కాక రేపుతోంది. ఇలా తన అందచందాలతో చాలా కాలంగా ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

బికినీ ఫొటోతో షాకిచ్చిన మెహ్రీన్
సోషల్ మీడియాలో అందాల విందు చేసినప్పటికీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా శృతి మించేలా వ్యవహరించలేదు. అయితే, ఇప్పుడీ బ్యూటీ ఏకంగా బికినీ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఆమెను తొలిసారి ఇలా చూసిన వాళ్లందరూ షాక్‌కు గురవుతున్నారు. ఫలితంగా ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇంకేముంది.. ఇది చాలా తక్కువ టైంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











