For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mehreen Kaur Pirzada: మెహ్రీన్ అందాల విందు.. అబ్బో ఆమె డ్రెస్ చూస్తే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది గ్లామరస్ హీరోయిన్లు సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరికొందరు మాత్రం అన్నీ ఉన్నా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఒకరు. చాలా కాలంగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేయలేకపోతోంది. అయినప్పటికీ ఫ్యాన్స్‌ను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మెహ్రీన్ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

  అలా వచ్చింది.. ఇలా పాపులారిటీ

  అలా వచ్చింది.. ఇలా పాపులారిటీ


  నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనే సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే క్యూట్‌నెస్‌తో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంది. అంతేకాదు, తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

  షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్

  ఎన్నో హిట్లు.. ఆ భాషల్లో మూవీలు

  ఎన్నో హిట్లు.. ఆ భాషల్లో మూవీలు


  తెలుగు సినీ ఇండస్ట్రీలో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈ ముద్దుగుమ్మ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు', 'ఎఫ్2', 'రాజా ది గ్రేట్', 'అశ్వద్ధామ' వంటి విజయాలను సొంతం చేసుకుంది. అలాగే, హిందీ, తమిళం, పంజాబీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.

  లవ్.. నిశ్చితార్థం.. పెళ్లి కాలేదుగా

  లవ్.. నిశ్చితార్థం.. పెళ్లి కాలేదుగా


  మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ కుమారుడు, యువ నేత భవ్య బిష్నోయ్‌తో లవ్ ట్రాక్ కూడా నడిపించింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం అతడితో నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది.

  స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!

  F3 నిరాశగా... చేతిలో ఆ రెండే

  F3 నిరాశగా... చేతిలో ఆ రెండే


  చాలా విజయాలు ఉన్నా మెహ్రీన్ కౌర్ ఫిర్జాదాకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఇక, ఇటీవలే ఈ ముద్దుగుమ్మ F3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ చిత్రం ఆశించిన రీతిలో విజయాన్ని అందుకోలేదు. ఇక, ఇప్పుడు తెలుగులో 'స్పార్క్', కన్నడంలో 'నీ సిగూవరగే' అనే చిత్రాలు మాత్రమే చేస్తోంది. మరికొన్నింటి కోసం చర్చలు జరుపుతోంది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా


  వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. కాస్త గ్యాప్ వచ్చినా మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాత్రం సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే సినిమా అప్‌డేట్లను కూడా తరచుగా ఇస్తోంది. ఫలితంగా ఈ బబ్లీ హీరోయిన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.

  టాప్ విప్పేసి రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా ఘోరంగా ఫోజులు

   అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో


  మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా టాలీవుడ్‌లోని మిగిలిన యంగ్ హీరోయిన్లతో పోలిస్తే సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ బ్యూటీ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసి కుర్రాళ్లలో కాక రేపుతోంది. ఇలా తన అందచందాలతో చాలా కాలంగా ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

  హాట్ ఫొటోలు వదిలిన మెహ్రీన్

  హాట్ ఫొటోలు వదిలిన మెహ్రీన్


  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్టైలిష్ డ్రెస్‌తో క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి చాలా తక్కువ టైంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.

  English summary
  Heroine Mehreen Kaur Pirzada Very Active in Social Media. Now She Shared Hot Photos in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X