Mehreen Kaur Pirzada: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. భర్త ఎవరంటే?

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నటినటులు తమ ప్రేయసి, ప్రియులతో ప్రేమాయణానికి స్వస్తి పలికి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కొందరు అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటే, మరికొందరు మాత్రం సీక్రెట్‌గా ఏడు అడుగులు నడుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటి మెహ్రీన్ కౌర్ పిర్జాదా సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌కు చెందిన మెహ్రీన్ తొలుత మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. 2013లో కెనడాలోని టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా కెనడా 2013 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత మోడల్‌గా పలు టాప్ బ్రాండ్స్‌కు ఎండార్స్‌మెంట్ చేసింది. ఈ క్రమంలో మెహ్రీన్‌కు టాలీవుడ్ నుంచి కబురొచ్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో ఆమె వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం, ఎఫ్ 2, ఎంత మంచివాడవురా, ఎఫ్ 3 తదితర తెలుగు సినిమాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, పంజాబీ సినిమాలలోనూ మెహ్రీన్ నటించారు.

Mehreen Kaur Pirzada s Secret Wedding Shocks Fans Actress Ties the Knot in a Private Ceremony

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ ప్రేమాయణం సాగించింది. 2021 మార్చిలో వీరిద్దరికీ ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. రేపో మాపో పెళ్లి అనుకుంటుండగా మెహ్రీన్- భవ్యలు తమ పెళ్లి రద్దు చేసుకున్నారు. దీనికి గల కారణాలపై మీడియాలో రకరకాల వాదనలు వినిపించాయి. మెహ్రీన్‌తో బ్రేకప్‌ తర్వాత భవ్య బిష్ణోయ్.. ఓ ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నారు. అటు మెహ్రీన్‌కు పూర్తిగా సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె కూడా విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ కాలం గడిపేసింది.

ఈ క్రమంలో మెహ్రీన్ సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. అర్ష్ ఔలక్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ రిసార్ట్‌లో మెహ్రీన్- అర్ష్‌ల పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పంజాబీ సాంప్రదాయంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అటు అర్ష్ ఔలక్‌కు ఎలాంటి సినిమా నేపథ్యం లేదని తెలుస్తోంది. తమ పెళ్లి ఫోటోలను మెహ్రీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. హీరోయిన్లు నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, పాయల్ రాజ్‌పుత్‌లతో పాటు స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ తదితర సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు.. పెళ్లి తర్వాత మెహ్రీన్ సినీ జీవితానికి రిటైర్‌మెంట్ ఇస్తారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోవడమే దీనికి కారణం. అలాగే హైదరాబాద్, చెన్నైలకు మెహ్రీన్ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. పంజాబ్‌లోని తన నివాసంలో లేదంటే విదేశాల్లో గడుపుతున్నారు. ప్రస్తుతానికి భర్తతో హనీమూన్‌కు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారు మెహ్రీన్.. కొన్నిరోజులు సెలబ్రేషన్స్ తర్వాత తన నట జీవితంపై మెహ్రీన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more about: mehreen kaur pirzada movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X