‘నేను సీక్రెట్ పెళ్లి చేసుకోలేదు.. ఎవరితో మ్యారేజ్ కాలేదు’

తెలుగు హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా సీక్రెట్ మ్యారేజ్ చేసుకొన్నారనే వార్తలు మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇటీవల ఓ ప్రముఖుడిని గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకొన్నారనే వార్తలు హడావిడి సృష్టించాయి. అయితే ఈ వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో మెహ్రీన్ ఘాటుగా స్పందించారు. తన సీక్రెట్ మ్యారేజ్ గురించి వార్తలు రాసిన వెబ్‌సైట్‌ను, రిపోర్టర్‌ను తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీలో కడిగిపోరేశారు. తన పెళ్లి గురించి వచ్చిన అవాస్తవ కథనాలపై ఆమె స్పందించిన వివరాల్లోకి వెళితే..

మెహ్రీన్ కెరీర్ విషయానికి వస్తే.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఆమె ప్రవేశించారు. ఆ తర్వాత జవాన్, F2, F3, ఎంత మంచి వాడవురా, చాణక్య, కవచం, పంతం లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలో నెంజిల్ థునివిరుంధాల్, నోటా,పటాస్, ఇంద్ర, హిందీ ఫిలౌరీ, చిత్రాల్లో కూడా నటించారు.

Mehreen Pirzada blast on Secret Marriage Rumours

అయితే కెరీర్ గ్రాఫ్ పీక్స్‌లో ఉండగానే.. 2021 సంవత్సరంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, హిస్పార్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయితో ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొన్నారు. అప్పటి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియాలో తన పెళ్లిపై కథనం రావడంపై తీవ్రంగా స్పందించారు. అసత్య వార్తలను ఆమె ఖండిస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో మెహ్రీన్ పిర్జాదా స్పందిస్తూ. తప్పుడు సమాచారంతో నేను సీక్రెట్ మ్యారేజ్ చేసుకొన్నానని వార్త రాయడం అనైతికం. అవాస్తవాలతో కథనాలను ఎలా ప్రచారం చేయవచ్చో అనే విధంగా జర్నలిజం దిగజారింది. గత 2 ఏళ్లుగా ఇలాంటి వేధింపు కథనాలపై మౌనం వహించాను. కానీ ఈ వేధింపులను తట్టుకొలేక ప్రస్తుతం నోరు విప్పాల్సి వచ్చింది. వాస్తవాలను చెప్పే క్రమంలోనే నేను స్పందిస్తున్నాను అని అన్నారు.

నాకు తెలియన వ్యక్తి పేరుతో నా పేరు జోడించి వివాహం అయినట్టు వార్త రాశారు. 2 నిమిషాల పాపులారిటీ కోసం నా వికీపీడియ పేజ్‌ను హ్యాక్ చేసి నేను సీక్రెట్ మ్యారేజ్ చేసుకొన్నారని కథనం రాశారు. నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటే.. ప్రామిస్‌గా చెబుతున్నా.. ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి తెలిసేలా పెళ్లి చేసుకొంటాను అని మెహ్రీన్ పిర్జాదా క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ రాసిన జాతీయ వెబ్‌సైట్లపై మెహ్రీన్ విరుచుకుపడ్డారు. ఆ వార్తను రాసిన జర్నలిస్టు పేర్లను, వెబ్‌సైట్ పేర్లను పేర్కొంటు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టుపై తీవ్రంగా ఆగ్రహం చెందుతూ.. నీకు నీవు జర్నలిస్టువని చెప్పకోకు. ఎందుకంటే ఆ పదానికి నీవు అర్హురాలివి కాదు అని తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలు, రూమర్లకు ముగింపు పలికారు.

More from Filmibeat

Read more about: mehreen pirzada tollywood rumours
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X