Mehreen Pirzada మీకు అక్కలు.. చెల్లెల్లు లేరా? మండిపడ్డ మెహ్రీన్ పిర్జాదా
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న మెహ్రీన్ పిర్జాదా కొద్దికాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటూ వస్తున్నది. ఇటీవల తాను టాలీవుడ్ దూరం ఎందుకయ్యాననే విషయాన్ని వెల్లడిస్తూ.. నాకు హిట్ సినిమాలు ఉన్నప్పటికీ.. మంచి పాత్రల కోసం వెయిట్ చేయడం వల్ల గ్యాప్ వచ్చింది. అయితే మళ్లీ మంచి సినిమాలతో నేను మీ ముందుకు వస్తాను అని ఆమె చెప్పింది. అయితే ఇటీవల ఆమె వెండితెర మీద బిజీగా ఉంటూనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. తొలి ఓటీటీ మూవీలో బోల్డుగా నటించడంపై ఆమె క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో సుదీర్గమైన లేఖ రాసింది. ఆ లేఖ వివరాల్లోకి వెళితే..
వెండితెరపై గ్లామర్ రోల్స్‌తో విశేషంగా ఆకట్టుకొన్న మెహ్రీన్ పిర్జాదా ఓటీటీలోకి ప్రవేశించింది. డిస్నీ + హాట్ స్టార్ ఫ్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ అవుతున్న సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్‌లో హాట్ హాట్‌గా నటించింది. అయితే వివాహిత పాత్రలో రేప్ సీన్‌లో నటించడంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాయి. దాంతో ఆమె తన పాత్ర గురించి వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

మెహ్రీన్ ఫిర్జాదా తన ట్విట్టర్‌లో. ఇటీవల వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టాను. నేను నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ డిస్నీ +హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఆ సిరీస్ చూసి నా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకొంటున్నాను. కొన్ని స్క్రిప్టులు కొన్ని సీన్లను డిమాండ్ చేస్తాయి. అవి అభిమానులను కొంత బాధించి ఉంటాయి. కథలో భాగంగా శృంగార సన్నివేశాల్లో, మితి మీరిన బోల్డ్ సీన్లలో నటించాల్సి వస్తుంది అని మెహ్రీన్ చెప్పారు.

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్‌లో దారుణమైన మానభంగం సీన్ ఉంటుంది. అయితే దానిని సెక్స్ సీన్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ ఆ కోణంలో ఆ సీన్‌ను చూడకూడదు. ఆ సీన్ గురించి ట్రోల్స్ రావడం బాధించింది. అలా కామెంట్స్ చేసే వారికి అక్కలు, చెల్లెలు లేరా? మహిళలపై అలాంటి దారుణ సంఘటన నిజ జీవితంలో ఏ ఒక్కరిపై జరుగకూడదని మొక్కు కొంటన్నాను అని మెహ్రీన్ చెప్పింది.
సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సినిమాలో నా పాత్రకు నేను ఎంత మేరకు న్యాయం చేస్తున్నానని మాత్రమే ఆలోచించాను. డైరెక్టర్ మిలన్ లూథ్రియా చాలా ఫ్రొఫెషనల్‌గా ఆ సీన్‌ను చిత్రీకరించాడు. షూట్ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా స్మూత్‌గా డీల్ చేశారు. నేను ఇప్పటి వరకు నటించిన హానీ, సంజన, మహాలక్ష్మీ పాత్రల ద్వారా ఒక ఆర్టిస్టుగా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాను అని మెహ్రీన్ ఫిర్జాదా చెప్పారు.


Click it and Unblock the Notifications











