షార్ట్ డ్రెస్ లో రెచ్చగొడుతున్న మెహ్రీన్.. కౌచ్ మీద అలా పడుకొని హాట్ ఫోజులు !
పంజాబ్ లోని ఒక సంప్రదాయ సిఖ్ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మెహ్రీన్ పిర్జాదా తెలుగులో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాని సరసన హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ మంచి పేరు దక్కించుకుంది. దీంతో తెలుగులో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే

అవకాశాలు తగ్గడంతో
మెహ్రీన్ రెండో సినిమా మహానుభావుడు కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత రాజా ది గ్రేట్ కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు తెలుగు సహా తమిళ భాషల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఐతే నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామకు తర్వాత తర్వాత వరుస డిజాస్టర్ సినిమాలు ఎదురు కావడంతో పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు.

ఎఫ్3
ఇక తెలుగులో చివరిగా అశ్వత్థామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ఆ తర్వాత మరో పెద్ద సినిమా అవకాశం అందుకోలేకపోయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్2 అనే సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో ఈ భామ హనీ అనే పాత్రలో నటిస్తోంది. అలాగే మారుతి నెల రోజుల్లో చేసిన మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

'మంచి రోజులు వచ్చాయి'
శుక్రవారం హైదరాబాద్ లో 'మంచి రోజులు వచ్చాయి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ పాల్గొన్నాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, సప్తగిరి, సుదర్శన్ , వైవా హర్ష, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ , రజిత ఇతర పాత్రలు పోషించారు. యూవీ కాన్సెప్ట్స్-మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనూప్ సంగీత దర్శకుడు.

పెళ్లి క్యాన్సిల్
అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఈ భామ ఆ మధ్య పెళ్లికి సిద్ధం అయిపోయింది. చడీ చప్పుడు లేకుండా హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు ప్రస్తుత ఆదం పూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో ఆమె వివాహం నిశ్చయం కాగా ఏమయిందో ఏమో ఇద్దరూ పెళ్లి రద్దు చేసుకుంటున్న ప్రకటన చేశారు.
Recommended Video

కైపెక్కిస్తూ
అయితే ఈ భామ తన ఇన్ స్టా వేదికగా ఒక ఫోటో పంచుకుంది. అందులో పింక్ డ్రెస్ ధరించగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఆమె పొట్టి బట్టలు ధరించి, ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఇక అలాగే కళ్ళజోడు పెట్టుకుని మెహ్రీన్ కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











