పెళ్లికి సిద్ధమైన మెహ్రీన్ పిర్జాది.. ఎంగేజ్‌మెంట్ డేట్ ఎప్పుడంటే.. వరుడు ఎవరంటే!

టాలీవుడ్‌లో కొందరు హీరోలకు లక్కీ మస్కట్‌గా మారిన అందాల భామ మెహ్రీన్ పిర్జాది అభిమానులకు షాకిచ్చింది. కెరీర్ టాప్ గేర్‌లో కొనసాగుతుండగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఏకంగా రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఇంటికి కోడలుగా వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె నిశ్చితార్థానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె ఎంగేజ్‌మెంట్ డేట్ ఎప్పుడంటే..

కెరీర్ ఊపులో ఉండగానే పెళ్లి పీటలపైకి

కెరీర్ ఊపులో ఉండగానే పెళ్లి పీటలపైకి

నేచురల్ స్టార్ నానితో కలిసి కృష్ణ గాడి వీర ప్రేమగాథ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ పిర్జాదా కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకొన్నది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 లాంటి ఘన విజయాలను తన ఖాతాలో వేసుకొన్నారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే పెళ్లికి సిద్దమయ్యారు.

మాజీ సీఎం మనవడితో డేటింగ్

మాజీ సీఎం మనవడితో డేటింగ్

మెహ్రీన్ పిర్జాదీ గత కొద్దికాలంగా హర్యానా కాంగ్రెస్ నేత భవ్య భిష్నోవ్‌తో అఫైర్‌లో ఉన్నారు. వీరిద్దరి ప్రేమ పీకల్లోతు చేరుకోవడంతో ఒక్కటవ్వాలని డిసైడ్ అయ్యారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, దివంగత భజన్ లాల్‌కు భవ్య బిష్ణోవ్ మనవడు అనే విషయం తెలిసిందే

జైపూర్‌లోని ప్రముఖ కోటలో నిశ్చితార్థం

జైపూర్‌లోని ప్రముఖ కోటలో నిశ్చితార్థం

మెహ్రీన్ ఫిర్జాది, భవ్య పెళ్లి నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు జైపూర్‌లో జరుగుతున్నాయి. వీరిద్దిరి వివాహ నిశ్చితార్థం జైపూర్‌లోని అలీలా ఫోర్ట్‌లో మార్చి 12వ తేదీన జరుగనున్నది. ఈ మేరకు అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందజేసినట్టు సమాచారం.

నిశ్చితార్థం తర్వాత పెళ్లి డేట్స్

నిశ్చితార్థం తర్వాత పెళ్లి డేట్స్


ఇక నిశ్చితార్థం తర్వాత మెహ్రీన్ పెళ్లి తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాల్లో నటిస్తారా? లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఒప్పుకొన్న సినిమాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

మెహ్రీన్ పిర్జాది కెరీర్ ఇలా

మెహ్రీన్ పిర్జాది కెరీర్ ఇలా

ఇక మెహ్రీన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా కాంబినేషన్‌లో వస్తున్న F3 చిత్రంలో మెహ్రీన్ నటిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలోనే ఉన్నాయి. ఇటీవల ఆమె నటించిన ఎంత మంచివాడవురా, అశ్వత్థామ చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X