For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుశాంత్ మృతి: నేను కూడా ఒక్కప్పుడు ఆ నరకాన్ని చూసా.. ఇలా చేస్తే బయటపడవచ్చు

  |

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త అలజడిని కలిగించింది. ఇంతకుముందు చాలా సార్లు ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. మానసిక ఒత్తిడి ఎంతగా ప్రభావం చూపుతుందో సినీ తారల మరణాలు ఉదాహరణగా నిలిచాయి. ఇక చాలా మంది స్టార్స్ డిప్రెషన్ నుంచి దాటి వచ్చిన వారే. రీసెంట్ గా టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా కూడా ఆ విషయంపై స్పందించింది.

  అందులో ఛాంపియన్..

  అందులో ఛాంపియన్..

  కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా మారింది. మోడల్ గా ఉన్నప్పుడు కూడా ఆమె అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసిందట. అయితే అంతకంటే ముందే ఈ బ్యూటీ ఎయిర్ పిస్టల్ గేమ్ లో ఛాంపియన్ గా నిలిచిందట.

  సుశాంత్ మృతి.. మాట్లాడడానికి ఏముంది?

  సుశాంత్ మృతి.. మాట్లాడడానికి ఏముంది?

  నేషనల్ లెవెల్లో ఎయిర్ పిస్టల్ గేమ్ ఆడిన అనుభవం ఉన్న మెహ్రీన్ ఆ తరువాత సినీ రంగాన్ని ఎంచుకుంది. ఆ తరువాత ఆమె కొంత డిప్రెషన్ కి కూడా గురయ్యిందట. ఆ విషయమే గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. అలాగే సుశాంత్ మృతిపై కూడా ఆమె బాధపడుతూ విచారణలో ఉన్న ఆ కేసు గురించి కొత్తగా మాట్లాడడానికి ఏముందని అంటూ.. కానీ డిప్రెషన్ అనేది చాలా భయంకరమైనదని సున్నితమైన మనస్తత్వం ఉన్మావాళ్ళు తట్టుకోలేరని ఈ బ్యూటీ తెలిపింది.

  నేను కూడా ఒకనొక సమయంలో

  నేను కూడా ఒకనొక సమయంలో

  మెహ్రీన్ మాట్లాడుతూ.. సాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో డిప్రెషన్ అనేది ఎదో ఒక సందర్భంలో చాలా ఎక్కువగా ఉంటుంది. నేను కూడా ఒకనొక సమయంలో చాలా డిప్రెషన్ కి గురయ్యాను. అయితే దాని నుంచి వీలైనంత త్వరగా బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. మనమీద మనకు ఒక నమ్మకం ఉండాలి. అలాగే దేవుడిపైన కూడా ఒక నమ్మకం అనేది ఉండాలి.

  డిప్రెషన్ తగ్గాలి అంటే..

  డిప్రెషన్ తగ్గాలి అంటే..


  జీవితం చాలా అంధమైనది. ఆ విషయాన్ని మర్చిపోకుండా గుర్తు చెసుకోవాలి. డిప్రెషన్ తగ్గాలి అంటే వీలైనంత వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువ సమయాన్ని గడపాలి. అప్పుడు మాత్రమే డిప్రెషన్ నుంచి బయటపడగలం. నిజానికి ఈ బిజీ బిజీ కాలంలో మానవజాతి మొత్తం ఒక తెలియని డిప్రెషన్ తో సతమతమవుతోంది. ఇలాంటి కష్ట సమయంలో ఓర్పుతో భవిష్యత్తు మీద నమ్మకంతో ముందడుగు వేయాలి.. అని మెహ్రీన్ వివరణ ఇచ్చింది.

  Dirty Hari Trailer | Shravan Reddy, Simrat Kaur | MS Raju's Film | Filmibeat Telugu
  ఇక F3 సినిమా గురించి మాట్లాడుతూ..

  ఇక F3 సినిమా గురించి మాట్లాడుతూ..

  ఎఫ్3 సినిమాలో కూడా నేను నటిస్తున్నాను. F2 సినిమాలో నటించిన ప్రైమరీ క్యాస్ట్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ ఇంకా దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి కథను చెప్పలేదు. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఆ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేది. F2లో ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ఏమిటో చూశారు. ఇక సీక్వెల్ లో అంతకు మించిన మీనింగ్ ఉండబోతోంది. ఆ విషయాన్ని నేను చెప్పడం కంటే డైరెక్టర్ అనిల్ చెబితేనే బావుంటుందని మెహ్రీన్ తెలియజేసింది.

  English summary
  The new heroines of Tollywood are now more than likely. Medium budget films are often seen as the main characters of the movie. Recently, Mehrene Pirzada's chances for such films have increased. But the opportunities that come with this beauty do not good. Comments have also been made that the sales have been done with no chance.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X