Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ప్రపంచంలో ఎవరు ఇలా ప్రపోజ్ చేయరేమో.. బాయ్ ఫ్రెండ్‌కు 6 రోజుల్లోనే పడిపోయిన్ మెహ్రీన్
టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఈ బ్యూటీ పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి. ప్రేమలో ఉందా లేదా అనే విషయాన్ని బయట పెట్టకుండా కొన్నాళ్ళు సీక్రెట్ లవ్ స్టొరీ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక ఫైనల్ గా పెళ్లికి రెడీ అయిన మెహ్రీన్ పిర్జాదా కాబోయే వాడు మొదటిసారి ప్రపోజ్ చేసిన విషయాన్ని ఇటీవల బయటపెట్టింది. ఆ రేంజ్ లో ఎవరు కూడా చెప్పరని తెలిపింది.
హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న జీనల్ జోషి
వరుసగా ఆఫర్లు
నాని- హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెహ్రీన్ పిర్జాదా కెరీర్ మొదట్లోనే ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేసింది. మొదట్లోనే వరుసగా ఆఫర్లు అందుకుంది. ఏడాదిలోపు ఆరు సినిమాలను ఒకే చేసింది. రవితేజతో చేసిన రాజా ది గ్రేట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
యుక్త వయసులో ఉండగానే
అప్పట్లో స్టార్ హీరోయిన్స్ హవా తగ్గడంతో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. పైగా మొదట్లోనే బాక్సాఫీస్ హిట్స్ దక్కడంతో ఒక మంచి ట్రాక్ సెట్టయ్యింది. కానీ కొన్నాళ్ళకి మెహ్రీన్ ట్రాక్ తప్పింది. వరుసగా డిజాస్టర్స్ వచ్చాయి. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఛాన్సులు అందుకుంటున్న ఈ బ్యూటీ వయసులో ఉండగానే పెళ్లికి సిద్ధమైంది.
పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)
బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమ వివాహం
కొంతమంది హీరోయిన్స్ కు ఈ మధ్య కాలంలో మూడు పదుల వయసు దాటితే గాని పెళ్లి ఆలోచనకు రావడం లేదు. కెరీర్ ఏ మాత్రం క్లిక్కయిన పెళ్లి బంధంతో దానికి బ్రేక్ వేయకూడదని ఆలోచిస్తున్నారు. కానీ కొందరు మాత్రం పెళ్లికి సినిమా కెరీర్ కు సంబంధం లేదు అన్నట్లుగా కొనసాగుతున్నారు. మెహ్రీన్ పిర్జాదాకు ఇప్పుడు 25ఏళ్లు. ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది.
పెద్దల నిర్ణయంతో
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మెహ్రీన్ తన లవ్ స్టొరీని బయటపెట్టింది. సడన్ గా పెళ్లి అంటూ షాక్ ఇచ్చిన ఈ బ్యూటి అసలు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందా లేక ప్రేమించి పెళ్లి చేసుకుంటుందా? అనే ప్రశ్నలు చాలానే వచ్చాయి. ఇక ఫైనల్ గా అమ్మడు పెద్దల నిర్ణయంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
సముద్రం అడుగున ప్రపోజ్..
మెహ్రీన్ కు కాబోయే భర్త పేరు బిష్ణోయ్. ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. ఇరు కుటుంబాలకు ముందు నుంచే పరిచయం ఉందట. పరిచయం అయిన 6రోజులకే అతను ప్రపోజ్ చేశాడని ఆ ప్రపోజల్ తో సరికొత్తగా ఆకట్టుకున్నట్లు వివరణ ఇచ్చింది. అండమాన్ లో ఐ లవ్ యు చెప్పాడని అంటూ అది కూడా సముద్రం అడుగున ప్రపోజ్ చేయడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు వివరణ ఇచ్చింది.