ఒక్కరూ రావడం లేదు, అతడి వల్లే నాశనమైంది: హీరోయిన్ శృతి హరిహరన్
Recommended Video

నటిగా తన కెరీర్ నాశనం అయిందని, అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అంటోంది కన్నడ నటి శృతి హరిహరన్. ప్రముఖ నటుడు అర్జున్ సార్జా మీద శృతి #మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
'విస్మయ' సినిమా చేసిన సమయంలో అర్జున్ తనతో తప్పుగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని, తనను ప్రైవేట్ ప్లేసుకు రమ్మని ఒత్తిడి చేసేవాడని ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. దీన్ని ఖండిస్తూ అర్జున్ కేసు వేడయడం, అతడిని అరెస్ట్ చేయాలంటూ శృతి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో ఈ వివాదం కోర్టుకెళ్లింది.

అవకాశాలు లేక ఖాళీ
అర్జున్ మీద #మీటూ ఆరోపణలు చేసిన తర్వాత శృతి హాసన్ కెరీర్ పరంగా వెనకబడిపోయింది. ఈ వివాదాస్పద నటికి సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

ఒక్కరూ రావడం లేదు
ఈ విషయమై శృతి హరిహరన్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్జున్ మీద ఆరోపణలు చేసిన తర్వాత తాను కెరీర్ నష్టపోయాను. ఎవరూ తనకు అవకాశం ఇవ్వడం లేదని వెల్లడించారు. గతంలో ప్రతి వారం ముగ్గురు నలుగురు నిర్మాతలు సంప్రదించేవారని, అయితే గత రెండు నెలలుగా తనకు ఎలాంటి అవకాశాలు రావడం లేదన్నారు.

ఆయనే చేస్తున్నారు
అర్జున్‌కు కన్నడ సినీ ఇండస్ట్రీలో చాలా పేరు, పాపులారిటీ ఉంది. సౌత్ లో అన్ని భాషల్లో ఆయన నటించారు. పలుకుబడి ఉపయోగించి తనకు అవకాశాలు రాకుండా అర్జున్ చేస్తున్నాడని శృతి హరి హరన్ ఆరోపిస్తున్నారు.

అర్జున్ ఏమంటున్నారు?
నేను 37 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాను. 150 పైగా చిత్రాల్లో నటించాయి. ఆంజనేస్వామికి పరమ భక్తుడిని. చెన్నైలో 32 అడుగుల పొడవైన ఆంజనేయస్వామి విగ్రహం నిర్మించా. చెడుగా ప్రవర్తించి ఉంటే ఇన్నేళ్ల పాటు నటుడిగా కొనసాగే వాడినా? అంటున్నారు అర్జున్. శృతి చేసిన నిరాధారమైన ఆరోపణల వలన తన కుటుంబం మానసిక క్షోభ అనుభవిస్తుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











