దేవరకొండ మూవీ అని ఆశపడ్డా... బెడ్రూంలోకి రమ్మన్నాడు, దర్శకుడు నీచుడని అర్థమైంది!
ఓ ప్రముఖ దర్శకుడు తనకు విజయ్ దేవరకొండ సినిమాలో మంచి పాత్ర ఆఫర్ చేశాడని, అయితే ఈ ఛాన్స్ దక్కాలంటే తనతో పడుకోవాలని, లైంగిక కోరిక తీర్చాలని కండీషన్ పెట్టినట్లు తమిళ నటి షాలు శాము ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతున్నా ఇంకా ఇలాంటివి జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తాజాగా ఓ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలు శాము... ఆ దర్శకుడు తనను ఎలా లొంగదీసుకోవడానికి ప్రయత్నించారో వివరించారు. 'నా పాత్ర గురించి చెప్పడానికి నన్ను రమ్మన్నాడు. వచ్చేపుడు సారీ కట్టుకుని రావాలని సూచించాడు. విజయ్ దేవరకొండ మూవీ అని చెప్పడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది ఓకే అయితే తనకు మంచి బ్రేక్ వస్తుందనే ఎగ్జైట్మెంటుతో వెళ్లినట్లు' తెలిపారు.

ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు
‘‘అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఇంట్లో ఫ్యామిలీ ఫోటోస్ కూడా ఉన్నాయి. అది అతడి ఇల్లు అని అర్థమైంది. అయితే ఇంట్లో ఎవరూ లేరు. ఇదే విషయం ఆయన్ను అడిగితే అంతా ఔట్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపారు. నాకు జ్యూస్ ఆఫర్ చేశాడు. కానీ తాగకుండా టేబుల్ మీద పెట్టాను.'' అని ఆ రోజు జరిగిన సంఘటన గురించి షాలు శాము వివరించారు.

బెడ్రూంలోకి రమ్మన్నాడు..
‘‘నాకు సినిమాలోని క్యారెక్టర్ చెబుతానని చెప్పి పిలిచిన సదరు దర్శకుడు.... ఆ విషయం మాట్లాడకుండా ఇతర విషయాలు మాట్లాడటం మొదలు పెట్టాడు. టాపిక్ మార్చడంతో కాస్త నర్వస్ అనిపించింది. చెమటలు రావడం చూసి బెడ్రూంలో ఏసీ ఉంది వెళ్లి అక్కడ కూర్చుందామని చెప్పాడు. అప్పుడే అతడి నీచబుద్ది అర్థమైంది'' అని షాలు శాము తెలిపారు.

దర్శకుడి పేరు చెప్పడానికి ఇష్టపడని షాలు శాము
అయితే దర్శకుడి పేరు చెప్పడానికి షాలు శాము ఇష్టపడలేదు. అందరికీ తెలిసిన వ్యక్తే, ఇపుడు అతడి పేరు బయట పెట్టడం వల్ల నా కెరీర్ ఇబ్బందులో పడుతుంది, ఇలాంటి వాటిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, అందుకే అతడికి లొంగి పోవడం ఇష్టం లేక ఆఫర్ వదులుకున్నాను అని షాలు శాము తెలిపారు.

ఇండస్ట్రీలో పరిస్థితి ఇంతేనా?
కాస్టింగ్ కౌచ్ అశంపై సినిమా ఇండస్ట్రీలో ఎన్ని పోరాటాలు జరుగుతున్నా... లైంగిక సుఖం తీరిస్తేనే అవకాశాలు ఇస్తామంటూ నీచంగా ఆలోచించే వారిలో మార్పు రాలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి పనులు చేసిన వారిపై ఆల్రెడీ బాలీవుడ్లో కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఇలాంటి వారు తమ తీరు మార్చుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











