పడుకుంటే విజయ్ దేవరకొండ మూవీలో ఛాన్స్ ఇస్తానన్నాడు... దర్శకుడిపై నటి సంచలనం!

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు తరచూ వింటూనే ఉన్నాం. తమకు ఎదురైన అనుభవాలను ఇప్పటికే కొందరు హీరోయిన్లు బహిరంగంగా చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. ఇదే కోవలో తాజాగా ఓ తమిళ నటి తాను ఎదుర్కొన్న సంఘటన గురించి వెల్లడించారు. అయితే ఇందులో విజయ్ దేవరకొండ పేరు వినిపించడంతో హాట్ టాపిక్ అయింది.

ఇటీవల విడుదలైన శివకార్తికేయన్ తమిళ మూవీ 'మిస్టర్ లోకల్'లో నటించిన షాలు శాము... అనే తమిళ వర్దమాన నటి ఈ ఆరోపణలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ ఉందంతాన్ని వెల్లడించారు. అయితే దర్శకుడి పేరు మాత్రం ఆమె బయట పెట్టలేదు.

తనతో పడుకుంటే విజయ్ దేవరకొండ మూవీలో ఛాన్స్ ఇస్తానన్నాడు

తనతో పడుకుంటే విజయ్ దేవరకొండ మూవీలో ఛాన్స్ ఇస్తానన్నాడు

విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్న ఓ దర్శకుడు.... తనతో పడుకుంటే ఈ మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడని షాలు వెల్లడించారు. మీకు ఎదురైన #మీటూ స్టోరీ గురించి చెప్పండని ఓ యూజర్ అడిగిన సందర్భంలో షాలు శాము ఈ విషయం బయట పెట్టారు.

అందుకే ఫిర్యాదు చేయలేదు

అందుకే ఫిర్యాదు చేయలేదు

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. అయితే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు కాబట్టి ఎవరికీ ఫిర్యాదు చేయలేదని షాలు తెలిపారు. ఫిర్యాదు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

ప్రముఖ దర్శకుడే నన్ను ఈ విధంగా అడిగాడు

ప్రముఖ దర్శకుడే నన్ను ఈ విధంగా అడిగాడు

విజయ్ దేవరకొండతో సినిమా చేయబోయే ఓ ప్రముఖ దర్శకుడే నన్ను ఈ విధంగా అడిగాడు. నాకు ఇష్టం లేకనే ఆఫర్ వదులుకున్నాను. ఒక వేళ మనం ఫిర్యాదు చేసినా వారు తప్పు చేసినట్లు ఒప్పుకుంటారా? ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీలో నా కెరీర్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారని శాలు షాము తెలిపారు.

చిన్న చిన్న పాత్రలతో ఇప్పుడే ఎదుగుతోంది

చిన్న చిన్న పాత్రలతో ఇప్పుడే ఎదుగుతోంది

షాలు శాము... తమిళ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. గతంలో కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదుర్కొన్న చాలా మంది చిన్న చిన్న యాక్టర్లు ప్రముఖుల పేర్లు బయట పెట్టినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

చిన్మయి లాంటి వారికే న్యాయం జరుగలేదు

చిన్మయి లాంటి వారికే న్యాయం జరుగలేదు

ప్రముఖ సింగర్ చిన్మయితో పాటు మరికొందరు.... స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీలోని పరిస్థితులను, తమకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనలు బయట పెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు ఈ నేపథ్యంలో షాలు శాము లాంటి వారు ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకుంటారు?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X