దుస్తులను చీల్చి నా అందాలను.. ఆ తప్పు సరిదిద్దుకోలేనిది.. మియా ఖలీఫా
పోర్న్ ఇండస్ట్రీలో నటించడం ద్వారా పడిన ఎదురైన కష్టాలను శృంగార నటి మియా ఖలీఫా మీడియాకు వెల్లడించారు. 2015లో మూడు నెలలపాటు పెద్దలకు మాత్రమే చిత్రాల్లో నటించడం వల్ల జీవితం ఎంత దుర్భరమైందనే విషయాన్ని ఆమె వెల్లడించారు. మూడు నెలలు పోర్న్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఇప్పటికీ ఆ రకం వెబ్‌సైట్లలో ఇంకా టాప్ యాక్టర్‌గా కొనసాగడంతో కెరీర్ దెబ్బ తింటున్నదని మియా ఖలీఫా వెల్లడించింది. తాజాగా ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్యూ తర్వాత తనకు ఎదురైన షాకింగ్ విషయాలను వెల్లడించారు.

అమ్మాయిల నుంచి వందల మెయిల్స్
నేను బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నాకు వందలకొద్ది ఈమెయిల్స్ వచ్చాయి. వాటిలో కొన్నింటిని నా మేనజర్లు వడబోసి నాకు ఫార్వర్డ్ చేశారు. చాలా మంది అమ్మాయిలు తాము అక్రమ రవాణాకు గురయ్యామని, బలవంతంగా వ్యభిచార రొంపిలో కూరుకుపోయామని తమ బాధను పంచుకొన్నారు అని మీయా ఖలీఫా పేర్కొన్నారు.

జీవితాన్ని సర్వనాశనం
సినీ అవకాశాలను ఎరగా చూపి తమను దారుణంగా వాడుకొన్నారు. కొందరు తమ జీవితాన్ని సర్వనాశనం చేశారని బాధితులు చెప్పుకోవడం కనిపించింది. కొన్నిసార్లు వాళ్లు చెప్పిన విషయాలు నాకు సరిగా అర్ధం కాలేదు. కాకపోతే వారు ఏ విధంగా బలైపోయారనే విషయం అర్ధమైంది అని మియా ఖలీఫా వెల్లడించారు.

మానసిక క్షోభను అనుభవించలేకపోయా
నాకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. పోర్న్ ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్న తర్వాత అనుభవించిన మానసిక క్షోభను నేను తట్టుకోలేకపోయాను. పబ్లిక్ ప్రదేశాల్లో తిరుగలేకపోయాను. నన్ను తీక్షణంగా చూడటాన్ని తట్టుకోలేకపోయాను. వారి చూపులు నా దుస్తులను చీల్చుకొని నా అందాలను చూస్తున్నారనేంతగా ఫీలింగ్ కలిగేది. అలాంటి చూపులను భరించడం కష్టంగా ఉండేది అని మియా ఖలీఫా అన్నారు.

ఫ్యామిలీ వెలివేసింది
పోర్న్ యాక్టర్ అని ముద్ర పడిన తర్వాత వ్యక్తిగత జీవితం హరించుకుపోయింది. ప్రైవసీ అనేది ఉండకపోయేది. నా గురించి గూగుల్‌లో సర్చ్ చేసే తీరును తెలుసుకొన్న తర్వాత ఎక్కడికైనా వెళ్లాలంటే భయంగా ఉండేది. నా ఫ్యామిలీ నన్ను దాదాపుగా వెలివేసింది. చాలా రోజులు ఒంటరితనాన్ని భరించాను. కొన్ని తప్పులు సరిదిద్దుకోలేమని అనిపించింది. తర్వాత లైబ్రేరియన్‌గా పనిచేసి జీవితం గడిపాను అని మియా ఖలీఫా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











