బాయ్ ఫ్రెండ్ పేరును పచ్చబొట్టుగా .. తమన్నా ఎక్కడ వేసుకుందో తెలుసా?
ప్రెజెంట్ జెనరేషన్‌లో తెలుగు సినిమా దగ్గర ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్స్ చాలా మందే ఉన్నారని చెప్పాలి. చిన్న చిన్న రోల్స్... చిన్న హీరోయిన్ లెవెల్లోనే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు బిగ్ స్టార్స్ సరసన హీరోయిన్స్ గా చేసే ఛాన్స్ లు కొట్టేసిన వారు ఉన్నారు. ఇలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు.
తమన్నా తెలుగులో ఎన్నో సినిమాలు చేయగా ఒక్కో సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టి టాప్ హీరోయిన్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర జెండా పాతింది. తెలుగుతో పాటు తమిళ్ సహా ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటించగా ఇపుడు హిందీలో సెటిల్ అయ్యిపోయింది. తమన్నా సౌత్‌లో ఉన్నప్పుడు రిలేషన్, ప్రేమ పుకార్లు లాంటివి ఏం రాలేదు కానీ ఎప్పుడైతే బాలీవుడ్‌లోకి వెళ్లిందో అక్కడే తన బెస్ట్ హాఫ్‌ని వెతుక్కుంది.

హిందీలో ఆమె చేసిన అడల్ట్ చిత్రం "లస్ట్ స్టోరీస్ 2"లో ఆమె నటించి అందరికీ షాకిచ్చింది. ఎప్పుడూ లేని విధంగా తమన్నా నుంచి ఊహించని హాట్ షో మాత్రమే కాకుండా బూతు సీన్స్ లో కూడా నటించడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. తన సరసన నటించిన ప్రముఖ నటుడు, మన తెలుగులో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "ఎంసిఏ" లో విలన్ విజయ్ వెర్మతో రెచ్చిపోయింది.
అక్కడి నుంచి ఇద్దరి ప్రేమాయణం మొదలు కాగా ఇప్పటీకీ వీరి ప్రేమ కొనసాగుతుండగా అందరూ ఈ జంట పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్నిసార్లు ఇద్దరూ కూడా కొన్ని సార్లు ఆసక్తికర వాస్తవాలు కూడా పంచుకున్నారు . కానీ ఈసారి తమన్నా మాత్రం ఏకంగా తన ప్రియుడి పేరును పచ్చ బొట్టు వేసుకుంది.
అది కూడా తన చేతి మధ్యలో చిన్నగా హిందీ అక్షరాలతో తన బాయ్ ఫ్రెండ్ పేరు విజయ్ అని రాయించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనితో విజయ్ అంటే తమన్నాకి ఎంత ఇష్టం అనేది అర్ధం చేసుకోవచ్చు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేసిన బాహుబలిలో పచ్చ బొట్టేసినా అంటూ తమన్నాపై ఓ సాంగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
కానీ నిజ జీవితంలో కూడా తన ప్రేమ కోసం ఆమె పచ్చ బొట్టు పొడిపించుకోవడం గమనార్హం. దీనితో ఇలా మరోసారి ఈ జంట హిందీ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక తమన్నా హిందిలో పలు సినిమాలు సహా అడల్ట్ వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుండగా తెలుగులో కూడా పలు సినిమాలు చేస్తుంది. వీటితో పాటుగా పలు సినిమాల్లో హాట్ ఐటెం సాంగ్స్‌లో కూడా కనిపించి మైమరిపిస్తోంది.


Click it and Unblock the Notifications











