Roja on CBN Arrest: జైలుకు కాకుండా జైలర్ సినిమాకు పంపిస్తామా? మంత్రి రోజా కామెంట్స్ వైరల్

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టిస్తోంది. 2021లో స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఈ అరెస్టుపై ఇప్పటికే ప్రముఖులు ఖండించారు. ఓవైపు టీడీపీ శ్రేణులు మండిపడుతుంటే... మరోవైపు వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్టుపై మంత్రి రోజా సెటైరికల్ ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

స్కిల్ డెవెలప్ మెంట్ స్కామ్ లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేయడం ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ శ్రేణులు ఎక్కడిక్కడ నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు ఈ అరెస్టును ఖండించారు. ప్రజాస్వామ్యం తరఫున పొరాడితే వైసీపీ ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందని ఆరోపణలు చేశారు.

Minister Roja Satirical Tweet on Lokesh and Chandrababu News Goes Viral

ఇక చంద్రబాబు అరెస్టుపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఇదంతా అప్రజాస్వామిక ప్రభుత్వం అంటూ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే.. దర్శకుడు రాఘవేంద్రరావు, పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ అరెస్టును విభేదించారు. ఇక బాలయ్య బాబు సైతం.. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి రామకృష్ణ కూడా చంద్రబాబు అరెస్టుపై కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన నిన్న విజయవాడ కనక దుర్గను ఫ్యామిలీతో దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మనం బాబుకు మద్దతు ఇచ్చి.. ఆయన్నీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఏపీ మంత్రి రోజా చంద్రబాబు అరెస్టుపై సెటైరికల్ ట్వీట్ చేశారు. కరెప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాను జైలుకు పంపక.. జైలర్ సినిమాకు పంపిస్తారా అంటూ.. సెటైర్స్ వేశారు. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ... చంద్రబాబు, లోకేష్ లను ఉద్దేశిస్తూ.. దారుణంగా సెటైర్స్ వేశారు. తను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది ఆమెపై విరుచుకుపడుతున్నారు.

రోజా చేసిన ట్వీట్ లో... మీ డాడీ...కేడి కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో నారా లోకేష్... మంచోడు కాదు సూట్ కేస్ కంపెనీలుతో ముంచేసినోడు మీ చంద్రబాబు నాన్న. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాని జైలుకి పంపక.. #Jailer సినిమాకి పంపిస్తారా? పప్పు మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే ఈకుంభకోణంలో విచారణ జరుపుకొండి.. అని ధైర్యంగా చెప్పు..!! #A1ChandraBabu ని ఇక ఏ దేవుడు కాపాడలేడు.. మీ తాత #ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. బై బై తుప్పు... బై బై పప్పు... అంటూ సెటైరికల్ గా రాసుకొచ్చారు. ఇది చూసిన టీడీపీ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X